36.6 C
India
Thursday, May 30, 2024
More

  Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

  Date:

  Hyderabad News
  Hyderabad News

  Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ నేటికాలంలో ఆడవాళ్ల నుంచి మగవారికి కూడా వేధింపులు పెరిగిపోయాయి. కాకపోతే మగవాళ్లు బయట చెప్పుకోలేక తమలో తామే కుంగిపోతున్నారు. సూటిపోటి మాటలతో ఇంట్లో పెట్టే టార్చర్ భరించలేక పలువురు భర్తలు బార్ షాపుల్లో సేదతీరడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు అమాయక భర్తలు తమ బాధలను బయటకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు.

  పెళ్లాం పోరు పడలేక ఓ భర్త సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కొంపల్లిలో జరిగింది. తన భార్య చీటికి మాటికి ఇబ్బంది పెడుతోందని వాపోయాడు. ఆమె టార్చర్ భరించడం తన వల్ల కాదంటూ ఆత్మహత్యే శరణ్యమని చెరువులోకి దిగాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చెరువు వద్దకు చేరుకున్నారు. సదరు యువకుడు నగేశ్ ను బయటకు రావాల్సిందిగా బతిమాలారు. అయితే తన భార్యతో ఎలాగైనా విడాకులు ఇప్పించాలని కోరాడు భర్త నగేశ్. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అతడి బాధ విని పరిష్కారం చూపుతామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

  కొంపల్లిలో తన భార్యత కలిసి ఉంటున్నాడు నగేశ్. అయితే కొంతకాలంగా భార్య వేధింపులు తాళలేకపోతున్నా అని చెప్పాడు. తన పిల్లలకు ప్రేమగా చాక్లెట్లు తీసుకొచ్చి ఇస్తే వాటిని ఇవ్వకుండా చేస్తోందని, పైగా మాట్లాడించేందుకు కూడా నిరాకరిస్తోందని వాపోయాడు. అడిగితే వాతలు పెడుతోందని తన టీ షర్ట్ విప్పి మరీ చూపించాడు. గత కొన్ని రోజులుగా ఈ టార్చర్ భరిస్తూ వచ్చిన నగేశ్ చివరకు చనిపోయాలని నిశ్చయించుకున్నాడు. కొంపల్లి సమీపంలోని జయభేరి పార్క్ వద్ద ఉన్న చెరువులో దిగాడు. గమనించిన స్థానికులు ఎందుకు చెరువులో దిగావు అని ప్రశ్నించగా తన గోడు వెల్లబోసుకున్నాడు. నగేశ్ కు నచ్చజెప్పి విడాకులు ఇప్పిస్తామని చెప్పడంతో చెరువులో నుంచి బయటకు వచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Share post:

  More like this
  Related

  Karthikeya Temple : హోసూరు కార్తికేయ ఆలయంలో వింత

  - హారతి సమయంలో పాల్గొన్న మయూరం Karthikeya Temple : హోసూరు కార్తికేయ...

  TG Raja Mudra : తెలంగాణ ప్రభుత్వ నూతన రాజముద్ర ఇదే

  TG Raja Mudra : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ...

  Manmohan Singh : మోదీవి విద్వేష ప్రసంగాలు..: మాజీ ప్రధాని మన్మోహన్

  Manmohan Singh : ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని...

  Hyderabad News : కుత్బుల్లాపూర్ లో దారుణం.. క్యాబ్ డ్రైవర్ ను గాయపరిచి దోపిడీ

  Hyderabad News : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Karthikeya Temple : హోసూరు కార్తికేయ ఆలయంలో వింత

  - హారతి సమయంలో పాల్గొన్న మయూరం Karthikeya Temple : హోసూరు కార్తికేయ...

  Hyderabad News : కుత్బుల్లాపూర్ లో దారుణం.. క్యాబ్ డ్రైవర్ ను గాయపరిచి దోపిడీ

  Hyderabad News : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి...

  Kerala News : భర్తను అలా అనడం క్రూరత్వమే..

  Kerala News : వివాహమనేది అనేది ప్రతిఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం....

  Nivetha Pethuraj : ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయను..పరువుకు సంబంధించిన మ్యాటర్..పోలీసులపై నివేదా పేతురాజ్ ఫైర్

  Nivetha Pethuraj : తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ నివేదా...