36.9 C
India
Sunday, May 5, 2024
More

    IPL 2024 Today : కోల్ కతా నైట్ రైడర్స్.. పంజాబ్ మధ్య కీలక పోరు

    Date:

    IPL 2024 Today
    IPL 2024 Today Match

    IPL 2024 Today : ఐపీఎల్ లో ఈ సీజన్ లో 42 వ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. కోల్ కతా ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడి అయిదింట్లో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ ఎప్పటిలాగే ఈ సీజన్ లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండింట్లోనే గెలిచింది.

    పంజాబ్ కు తాత్కాలికంగా సామ్ కర్రన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. లివింగ్ స్టన్ ఫామ్ కోల్పోవడం పంజాబ్ కు తీవ్రంగా దెబ్బతీస్తోంది. సామ్ కర్రన్, లివింగ్ స్టన్, బౌలర్ రబడా తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. బ్యాటింగ్ లో అయితే యువ సంచలనాలు అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది.

    కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం మంచి ఊపు మీద ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సునీల్ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అండ్రీ రస్సెల్ కూడా ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. మిచెల్ స్టార్క్ గత మ్యాచ్ లో గాయపడ్డాడు. ప్రస్తుతానికి అందుబాటులో ఉంటాడా.. లేదా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇప్పటి వరకు మిచెల్ స్టార్క్ పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో మూడు సిక్సులు ఇచ్చి మ్యాచ్ పోగొట్టినంత పని చేశాడు.

    శిఖర్ దావన్ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనేది ఇంకా ఏదీ తేలలేదు. పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. మేం అన్ని మ్యాచ్ లు గెలవాల్సిందే. మాకు వేరే అప్షన్ లేదని చెప్పాడు. పంజాబ్ అశుతోష్ శర్మ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కోల్ కతా బ్యాటింగ్ లో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు చూస్తే ఈ మ్యాచ్ లో కోల్ కతానే ఫేవరేట్ అని గణాంకాలు చెబుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...