2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటించిన విషయం తెలిసిందే. భారత్ లో తన భార్య మెలానియా , కూతురు ఇవాంక ట్రంప్ , అల్లుడు కుశ్నర్ లతో పాటుగా అమెరికా ఉన్నతాధికారులతో కలిసి ట్రంప్ పర్యటించారు. కాగా ఆ పర్యటనకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని కోరుతూ ఓ వ్యక్తి ఆర్టీఐ ని కోరగా దానికి ఎలాంటి సమాధానం లభించలేదు.
దాంతో ఆర్టీఐ కమీషన్ ని సంప్రదించగా ఎట్టకేలకు ట్రంప్ పర్యటనకు అయిన ఖర్చు తెలిపారు. ఇంతకీ ట్రంప్ పర్యటనకు భారత్ వెచ్చించిన ఖర్చు ఎంతో తెలుసా ……. 38 లక్షలు. భోజనానికి , ఇతర సౌకర్యాలకు , విడిదికి అలాగే ట్రాన్స్ పోర్ట్ కు మొత్తంగా 38 లక్షలు ఖర్చు చేసిందట కేంద్ర ప్రభుత్వం.
Breaking News