PM Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నా రు. ఆదిలాబాద్‌లో వర్చువల్ విధానంలో రూ.6 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాప నలు చేసిన ఆయన.. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధికి సీఎం రేవంత్‌కు సంపూర్ణంగా సహకరిస్తాం. తెలంగాణలో గడిచిన పదేళ్లలో రూ.56 వేల కోట్లకుపైగా పనులు ప్రారంభించాం. అభివృద్ధిలో కొత్త అధ్యయనాన్ని లిఖించాం” అని అన్నారు. అంబారీ – ఆదిలాబాద్ – పింపాలకుట్టీ రైల్వే విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు. మంచిర్యాల జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ రెండో థర్మల్ పవర్ యూనిట్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.