36.2 C
India
Friday, May 3, 2024
More

    Chandrababu : అనుభవజ్ఞుడైన లీడర్ బాబు.. పీఎం కితాబు..

    Date:

    Chandrababu
    Chandrababu

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ కూడా బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన ఎక్స్ (ట్విటర్) ఖాతా నుంచి విషెస్ ట్వీట్ చేశాడు.

    ఏపీ అంకితం..
    మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని బాబు అనుభవజ్ఞుడైన నాయకుడు అంటూ కితాబిచ్చారు. ఆయన ఎప్పుడూ ఏపీ అభివృద్ధికి అంకితమయ్యారని, ప్రజా సేవ చేస్తూ ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.

    సైబర్ టవర్స్ వద్ద వేడుకలు
    టీడీపీ లీడర్, మాజీ సీఎం బాబు పుట్టిన రోజును ఐటీ ఉద్యోగులు సంబురంగా నిర్వహించుకున్నారు. వేడుకలను ఆయన అభిమానులు హైదరాబాద్ లో  ఘనంగా నిర్వహించారు. ‘సైబర్ టవర్స్’ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నీ వల్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం.. అంటూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు సంబంధించి బ్యానర్లను ఏర్పాటు చేశారు.

    ఖమ్మంలో..
    హ్యాపీ బర్త్ డే చంద్రబాబు అంటూ ఖమ్మం నాయకులు నినాదాలు చేశారు. ఖమ్మం ఎన్టీఆర్ భవన్ లో బాబు అభిమానులు 74 కేజీల కేక్ కట్ చేసి అందరికీ పంచి సంబురాలు చేసుకున్నారు. బాబు జన్మదినం సందర్భంగా ఉద్దండరాయుని పాలెం కు చెందిన జేఏసీ దళిత నాయకుడు, రైతు పులి చిన్నా చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతూ శుభాకాంక్షలు చెప్పారు.

    16,676 అడుగుల ఎత్తున..
    సముద్ర మట్టానికి 16,676 అడుగుల ఎత్తున ఉన్న మౌంట్ ఎవరెస్ట్ మార్గం మధ్యలోని నాగర్ శంగ్ పర్వతంపై బాబు చిత్రపటాన్ని ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎంగా బాబు బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని పులి చిన్న ఆకాంక్షించారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...