41.1 C
India
Monday, May 20, 2024
More

    Costely City : ఖరీదైన నగరంగా హైదరాబాద్.. 5 ఖండాల్లోనే బెస్ట్ ప్లేస్ దక్కించుకున్న భాగ్యనగరం

    Date:

     

    Costely City
    Costely City

    Costely City : వసతి, ఆహారం, రవాణా, దుస్తులు, గృహోపకరణాలను బట్టి కాస్లీయస్ట్ నగరం జాబితాను రూపొందించింది ఓ సంస్థ. 5 ఖండాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మన హైదరాబాద్ కు ఈ సారి చోటు లభించింది. అది ఏస్థానం అన్నది పక్కన ఉంచితే ఖండాంతరాలకు మన హైదరాబాద్ పేరు పాకుతుందన్నది సంతోషమే కాదా. భారత్ లో విదేశీయులకు కూడా అత్యంత ఖరీదైన నగరంగా ఈ సిటీ గుర్తింపు దక్కించుకుంది. దేశీయంగా చూస్తే ఈ జాబితాలో ముంబై అగ్ర స్థానాన్ని అందుకుంది. తర్వాత వరుసగా ఢిల్లీ, చెన్సై, బెంగళూర్, కోల్‌కత్తా, పూణె ఉన్నాయి. ‘మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ ఈ వివరాలను వెల్లడించింది.

    5 ఖండాల్లో 227 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఆ విశేషాలను తెలుసుకుందాం..

    *ప్రపంచం మొత్తం మీద ఖరీదైన నగరాల్లో ముంబైకి 147వ స్థానం దక్కింది. ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూర్ 189, హైదరాబాద్ 202, కోల్‌కత్తా 211, పూణె 213 స్థానల్లో నిలిచాయి.
    *అంతర్జాతీయంగా చూస్తే వరుసగా హాంకాంగ్, సింగపూర్, జూరిచ్ ఫస్ట్ త్రీ ప్లేస్ లను దక్కించుకుంది. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో హవానా (ఈ ఏడాది ఇది 83 స్థానాలు కోల్పోయింది). పాక్ నుంచి కరాచీ, ఇస్లామాబాద్ చోటును దక్కించుకున్నాయి.
    *ముంబైతో పోలిస్తే చెన్నై, హైదారాబాద్, కోల్‌కత్తా, పూణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువ ఉన్నాయి. ఇక విదేశీ ఉద్యోగులకు కోల్‌‌కత్తాలో అత్యంత తక్కువ ఖర్చులు ఉన్నాయి.
    *అంతర్జాతీయ ర్యాంకింగ్ లో దేశంలోని నగరాల స్థానాల్లో మార్పులు కనిపించాయి. కరెన్సీ ఊగిసలాటలు, ఐరోపా వంటి దేశాల్లో వస్తువులు, సేవల ధరల్లో మార్పులు ఇందుకు కారణంగా నిలిచాయి.
    *విదేశాలకు కార్యకలాపాలు నిర్వహించే ఎంఎన్‌సీలకు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో షాంఘై, బీజింగ్, టోకియోలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ మంచి స్థానాలని సంస్థ నివేదికలో వెల్లడించింది.
    *ఆసియాలోనే అత్యంత ఖరీదైన అగ్రగామిగా ఉన్న 35 నగరాల్లో ముంబై, ఢిల్లీ ఉన్నాయి. ఆసియా నగరాల్లో ముంబై స్థానం గతేడాదితో పోలిస్తే ఒక స్థనం తగ్గి 27వ స్థానానికి చేరింది.

    Share post:

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...