39.1 C
India
Monday, May 20, 2024
More

    Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యాణీకి ఆన్ లైన్ లో ఆర్డర్ల మోత

    Date:

    Hyderabad Biryani : బిర్యాణీ అంటే అందరికి ఇష్టమే. హైదరాబాద్ థమ్ బిర్యాణీకి మంచి డిమాండ్ ఉంటుంది. దేశంలోనే పేరుపోయిన బిర్యాణీగా మన హైదరాబాద్ కు పేరుంది. హైదరాబాద్ వచ్చిన వారికి బిర్యాణీ తినాలనే కాంక్ష ఉంటుంది. లొట్టలేసుకుంటూ తింటారు. అదే మన హైదరాబాద్ బిర్యాణీ స్పెషల్. దేశంలోనే పేరుగాంచిన బిర్యాణీగా ప్రఖ్యాతి గాంచింది.

    మన బిర్యాణీ ఘుమఘుమలు పీల్చితే అమోఘం. హైదరాబాద్ బిర్యాణీ రుచి వేరుగా ఉంటుంది. దీన్ని ప్రముఖ డెలివరీ సంస్థ ఫుడ్ స్విగ్లీ సరఫరా చేస్తోంది. ఆర్డర్ మీద ఎవరికైనా పంపిస్తోంది. దీంతో మన హైదరాబాద్ వాసులు ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఆన్ లైన్ లో 77 లక్షల బిర్యాణీ ఆర్డర్లు చేశారని తెలిపింది. దీంతో మనవారు తిండి విషయంలో ఎంత ముందుచూపుతో ఉన్నారో అర్థమవుతోంది.

    ప్రపంచ బిర్యాణీ డే సందర్భంగా స్విగ్లీ ఈ మేరకు లెక్కలు తెలియజేసింది. బిర్యాణీ ఆరగించడంలో మనవారు సైతం ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 23 నుంచి జూన్ 15 మధ్య సంస్థ ఆర్డర్లు వెల్లడించింది. ఈ ఐదు నెలల కాలంలో బిర్యాణీ ఆర్డర్లు 8.39 శాతం పెరిగాయి. ఆర్డర్లు 150 లక్షలకు పైగా జరిగినట్లు వెల్లడించింది. తొమ్మిది లక్షలకు పైగా ఆర్డర్లు థమ్ బిర్యాణీకి రావడంతో రికార్డు సృష్టంచినట్లు ప్రకటించింది.

    హైదరాబాద్ నగరంలో బిర్యాణీ ఆఫర్ చేసే రెస్టారెంట్లు 15 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అమీర్ పేట, బంజారాహిల్స్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, మాదాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆర్డర్ల పరంగా  చూస్తే కూకట్ పల్లి నుంచి ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని చెబుతున్నారు. తరువాత మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    Indian 2 : ‘భారతీయుడు 2’ స్టోరీ ఇదే.. భారీ స్కెచ్ తో వస్తున్న శంకర్..

    Indian 2 : తమిళ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related