39.1 C
India
Monday, May 20, 2024
More

    ‘Iratta’ movie : ‘ఇరట్టా’ ఇదేం ట్విస్ట్ రా స్వామి.. ఊహకు అందని హత్య కేసు రివీల్

    Date:

    ‘Iratta’ movie :
    సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ సినిమాలు ఎక్కువగా మలయాళం నుంచే వస్తుంటాయి. టాలీవుడ్ లో భారీ కలెక్షన్లు ఉంటే మాలీవుడ్ లో భారీ కథలు కనిపిస్తాయి. చివరి వరకు కుర్చీని అంటి పెట్టకునేలా అక్కడి దర్శకులు కథలను ప్లాన్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే వచ్చింది ‘ఇరట్టా’. ఈ సినిమాలో జోజు జార్జి, అంజలి లీడ్ రోల్స్ లో నటించారు.

    ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అసలు ఈ సినిమాలో ఏం ఉందో తెలుసుకుందాం. కేరళలో వాగమన్ అనే ఊరిలోని పోలీస్ స్టేషన్‌లో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటారు. పోలీసులు ఈ ఏర్పాట్లలో ఉండగానే తుపాకీ పేలిన సౌండ్ వస్తుంది. దీంతో వారు అక్కడికి వెళ్లి చూడగా వినోద్ అనే ఓ ఏఎస్ఐ  (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు. దీంతో హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి విచారణ మొదలు పెడతారు. వినోద్ చనిపోయిన సంగతి  తెలుసుకున్న వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్‌ (జోజు జార్జి సెకండ్ రోల్) అక్కడికి చేరుకుంటాడు. ఇంతకీ వినోద్‌ను హత్య చేసిందెవరు? ప్రమోద్, వినోద్ మధ్య గొడవలున్నాయా ? అసలు మాలిని (అంజలి) ఎవరు? అనేది అసలైన కథ.

    ప్రతి రోజూ సమాజంలో మన చుట్టూ జరిగే  ఘటనలను బేస్ చేసుకొని అందులో నుంచి ఒక పాయింట్ తీసుకొని దాని చుట్టూ కథను అల్లాడు దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణ. ఈ చిత్రం పోలీస్ స్టేష‌న్‌లో ఏఎస్ఐ  వినోద్ హతమైన సీన్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత పోలీసుల విచారణ లో ఒక్కొక్కొరు వినోద్‌తో వారికి గొడ‌వ‌ల‌ గురించి చెప్పడం వల్ల వినోద్ హత్య వెనుక కార‌ణాలను ఫ్లాష్‌బ్యాక్ తో రివీల్ చేయడం అద్భుతంగా ఉంటుంది.

    వినోద్ ను హతమార్చింది ప్రమోద్ అని ఊహాగానాలు వస్తుండగా ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు డీఎస్పీ ప్రమోద్. ఈ హత్య మిస్టరీని చేధించే సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి జోజు జార్జ్ నటన హైలెట్ గా నిలుస్తుంది. ఇందులో అంజలి పాత్ర కు ఒక్క డైలాగ్ కూడా లేదు. ఈ మూవీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ఈ చిత్రాన్ని జోజు జార్జి నిర్మించాడు.

    Share post:

    More like this
    Related

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    December Movies : రెండు సినిమాలు, రెండు కథలు.. కానీ ఒకే ఎమోషన్..

    December Movies : డిసెంబర్ లో తండ్రీ పిల్లల మధ్య ఎమోషన్...

    Trisha Thanked Lokesh : తనను చంపనందుకు ‘లోకేష్’కు థ్యాంక్స్ చెప్పిన త్రిష..

    Trisha Thanked Lokesh : ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో పంథా...

    ‘800’ Trailer : అదరగొడుతున్న ‘800’ ట్రైలర్.. ఇందులో ఏముందంటే?

    '800' Trailer : ఇటీవల కాలంలో బయోపిక్ ల కాలం నడుస్తోంది....