35.3 C
India
Tuesday, May 21, 2024
More

    Chintala Raju : అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో చింతల రాజు

    Date:

    Chintala Raju in American congress elections
    Chintala Raju in American congress elections

    Chintala Raju :

    తెలుగువారు విదేశాల్లో సత్తా చాటుతున్నారు. ప్రవాస భారతీయుల సత్తాతో వివిధ దేశాల్లో మంచి హోదాల్లో కొనసాగుతున్నారు. అధ్యక్షుడు నుంచి వార్డు నేత వరకు పలు రంగాల్లో నిష్ణాతులుగా మారుతున్నారు. తమ నైపుణ్యాలతో అక్కడి వారిని సైతం తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటూ మన వారి ప్రతాపం చూపెడుతున్నారు. దీంతో మన వారి ప్రజ్ణా పాటవాలకు మురిసిపోతున్నారు.

    ఈ నేపథ్యంలో ఇండియానా పోలీస్ కు చెందిన ప్రవాస తెలుగు ప్రముఖుడు హోమిల్టన్ కౌంటీ రిపబ్లికన్ పార్టీ కోశాధకారి చింతల రాజు ఇండియానా (ఫిఫ్త్ డిస్ట్రిక్ట్) నుంచి అమెరికా కాంగ్రెస్ బరిలో పోటీ చేస్తున్నారు. ఇండియానా ఇండియా వాణిజ్య మండలి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో ఆయనకు మద్దతు బాగానే పెరుగుతోంది.

    వ్యాపారవేత్త, స్పీచ్ పాథాలజిస్ట్ గా రాజు ఇండియానాలో అందరికి సుపరిచితుడే. 1994 నుంచి ఇండియానాలో నివసిస్తున్న ఆయనకు పలువురు ప్రవాస భారతీయులు తమ మద్దతు ఇస్తున్నారు. దీంతో గెలుపు తనదేననే ధీమాలో ఉన్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

    రాజకీయాల గురించి రాజు తనదైన శైలిలో ఉపన్యాసాలు ఇస్తుంటారు. ప్రముఖ రాజకీయ విశేషాల గురించి ఎప్పటికప్పుడు తన మాటల ద్వారా చైతన్యం కలిగిస్తుంటారు. ఈనేపథ్యంలో రాజు ఇండియానాలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల్లో నెగ్గి మన భారతీయుల పరువు నిలబెడతారని అంచనా వేస్తున్నారు. ఆయన విజయం నల్లేరు మీద నడకే అని పలువురు ప్రవాస భారతీయులు చెబుతున్నారు.

    -ఎవరీ చింతల రాజు

    గత 30 సంవత్సరాలుగా చింతల రాజు వృత్తిపరమైన, వ్యక్తిగత సేవలో అమెరికాలో అందరికీ బాసటగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకుంటూ ప్రభావితం చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణలో నాయకుడిగా రాజు మారాడు. అమెరికాలో ప్రస్తుతం స్పీచ్ పాథాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను లాభదాయకమైన భాగస్వామ్యాలను సృష్టించడం.. విస్తరించడం, హోటల్ ఫ్రాంచైజీలను నిర్వహించడం.. అంతర్జాతీయ కార్పొరేట్ విస్తరణ కార్యక్రమాలకు నాయకత్వం వహించడంలో అనుభవంతో వ్యాపారంలో ముందుంటున్నారు. కమ్యూనిటీలో ఒక నాయకుడు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ , $500 మిలియన్లకు పైగా సానుకూల ఆదాయ పెట్టుబడులను సృష్టించడంలో ఈయన ఎందరికో సహాయం చేస్తున్నారు.

    ఇండియానా ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారతదేశానికి సీనియర్ అడ్వైజర్‌గా రాజు సంబంధాలను పెంపొందిస్తున్నారు. దాని ఫలితంగా వేలాది ఉద్యోగాలు వచ్చాయి. ఇండియానా ఇండియా బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపకుడిగా.. అధ్యక్షుడిగా, అతను ఇండియానా , భారతదేశం మధ్య ఆర్థిక వారధిని నిర్మించడంలో సహాయం చేస్తున్నారు.

     

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...