32.2 C
India
Tuesday, May 21, 2024
More

    Court Conditions to Chandrababu : చంద్రబాబు కి కోర్టు పెట్టిన షరతులు ఇవే.! ఉల్లంఘిస్తే సరెండరే..?

    Date:

    Court conditions to Chandrababu
    Court conditions to Chandrababu

    Court Conditions to Chandrababu : ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభిచింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో  కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబు అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. మంగళవారం ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాల రీత్యానవంబర్‌ 24 వరకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

    తదుపరి విచారణను నాలుగు వారాల పాటు అంటే 24 వరకు వాయిదా వేసింది.. ఇదే సమయంలో చంద్రబాబుకు కొన్ని షరతులు విధించింది న్యాయస్థానం.. ఇక, మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో ఈ రోజు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. మరోవైపు మద్యంనూ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.. హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు బాబు తరఫు న్యాయవాదాలు.. ఆ పిటిషన్‌ను విచారణకు అనుమతించింది హైకోర్టు.. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది.

    హైకోర్టు బెయిల్ కండీషన్లు ఇవే..

    • హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్‌ ఇస్తూనే షరతులు విధించింది హైకోర్టు.
    • చంద్రబాబు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన రాదు.
    • కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయరాదు.
    • ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసినందున ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాలి.
    • చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలు, ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించారు.
    • జడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో.. కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, చంద్రబాబుకు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.
    • పిటిషనర్ చంద్రబాబు లక్ష రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు ట్రయల్ కోర్టు ఎదుట సమర్పించాలని ఆదేశించింది.
    • చంద్రబాబు తన సొంత ఖర్చులతో తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చు.
    • చంద్రబాబు ఏ ఆస్పత్రిలో చిక్సిత పొందారో.. ఆయనకు ఏ చిక్సిత అందించారో పూర్తి  వివరాలను సీల్డ్ కవర్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కి లొంగిపోయే సమయంలో అందజేయాలి.
    • పిటిషనర్ చంద్రబాబు ప్రత్యక్షంగానీ లేదా పరోక్షంగానీ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తితో మాట్లాడకూడదు. వారిని ఎటువంటి ప్రేరేపణ, బెదిరింపు చేయకూడదు. రాజకీయ సమావేశాల్లో కానీ, నేతలతో భేటీలో కానీ పాల్గొనవద్దని తెలిపింది.
    • చికిత్స అనంత‌రం నవంబ‌ర్  28, 2023న సాయంత్రం 5 గంటలలోపు చంద్రబాబు తనంతట తాను రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

    కాగా.. చంద్రబాబు విడుదలకు సంబంధించిన డ్యాకుమెంటరీ వర్క్  అంతా ఈ రోజు  మధ్యాహ్నం పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని సక్రమంగా పూర్తయితే చంద్రబాబు  మంగళవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

    బీజేపీ వ్యూహమా?

     అయితే చంద్రబాబు అరెస్టు నుంచి వైసీపీ ఆదేశాల మేరకే కేంద్రంలోని బీజేపీ నడుచుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర సహకారంలేకుండా మాజీ సీఎం, ప్రతిపక్షనేతను అరెస్టు చేయడం అంత సులువు కాదని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.  ఇప్పుడు బెయిలు మంజూరు విషయంలోనూ అవే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉంటున్నందునే చంద్రబాబుకు బెయిలు మంజూరైందనే విమర్శలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...