41.1 C
India
Monday, May 20, 2024
More

    Bubblegum Movie Review : సుమ కొడుకు సినిమా హిట్టా? ఫట్టా?

    Date:

    Bubblegum Movie Review
    Bubblegum Movie Review

    నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్షవర్ధన్, అను హాసన్ తదితరులు
    నిర్మాత: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
    దర్శకుడు: రవికాంత్ పేరేపు
    మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
    సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు
    రిలీజ్ డేట్: 29 డిసెంబర్ 2023

    సుమ పేరు చెప్పగానే తమ ఇంటి మనిషే అన్నంత ప్రేమ చూపిస్తారు జనాలు. యాంకర్ గా ఆమెది గత 25 ఏండ్లుగా నంబర్ వన్ పొజిషన్. తరాలు మారుతున్నా ఆమె స్థానం మాత్రం చెక్కుచెదరనిది. ఎంతో మంది హీరోల సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేయడం, అలాగే వారిని ఇంటర్వ్యూ చేసేది. ప్రీ రిలీజ్ వేడుకలో సుమ యాంకరింగ్ చేసిందంటే సినిమా హిట్టే అని కొందరు నమ్ముతారు. మరి అలాంటి సుమ తనయుడు హీరోగా ‘బబుల్ గమ్’ ఇవ్వాళ విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? సుమ తనయుడు ఎలా చేశాడు? హిట్టు కొడుతాడా? హీరోగా పాసవుతాడా? అనేది చూద్దాం..

    స్టోరీ ఏంటంటే..

    ఆది(రోషన్ కనకాల) పక్కా హైదరాబాదీ కుర్రాడు. డీజే కావాలన్నది అతడి గోల్. ఓ సారి అనుకోకుండా ఓ పబ్ లో జాన్వీ( మానస చౌదరి)ని చూస్తాడు. అతడికి ఆమె తెగ నచ్చుతుంది. దీంతో ఆమెను రోజూ ఫాలో అవుతుంటాడు. మరోవైపు జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్ గివ్ లంటే ఆమెకు పడవు. అబ్బాయిలంటేనే ఆమెకు ఎలర్జీ. ఆటబొమ్మల్లా చూస్తుంది. ఇలాంటి అమ్మాయి ఆదితో లవ్ లో పడుతుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లెమ్స్ వస్తాయి. అవెంటీ.. భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరూ కలిశారా? అనేది సినిమా స్టోరీ.

    ఎలా ఉందంటే..

    ఓ అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరి మధ్య ప్రేమ, ముద్దులు, హగ్గులు.. ముందు గొడవపడడం.. తర్వాత ఒక్కటవడం.. ఇలా లవ్ స్టోరీలన్నీ ఒకే ఫార్మాట్ లో ఉంటాయి. అయితే సినిమా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిందా లేదా అనేదే ముఖ్యం. వారు ఎంటర్ టైన్ అయితే సినిమా హిట్ అయినట్టే. ఈ విషయంలో ‘బబుల్ గమ్’ పాస్ అయినట్టే.

    సినిమా అసలు కథలోకి వెళ్తే.. కేవలం చెడ్డీతో బైక్ పై హీరో అరుస్తూ, ఏడుస్తూ హైదరాబాద్ రోడ్లపై వెళ్లే సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కథ.. ఆరు నెలల వెనక్కి వెళ్తుంది. పక్కా హైదరాబాదీ కుర్రాడైన ఆదిత్య(రోషన్ కనకాల) ఎంట్రీ.. ఓ డీజే దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలలు కంటూ ఉంటాడు. ఇతడి స్టోరీలోనూ ఎప్పుడూ తిట్టే తండ్రి.. సపోర్ట్ చేసే తల్లి ఉంటారు. అనుకోకుండా జాన్వీ(మానస చౌదరి)ని చూడడం..ఆమెతో లవ్ లో పడడం జరుగుతుది. ఇలా పెద్దగా ఎలాంటి మలుపులు గట్రా లేకుండానే ఫస్టాప్ సాగుతుంది. ఓ డిఫరెంట్ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. దీంతో స్టోరీపై కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది.

    ఇక సెకండాఫ్ లో లవ్ స్టోరీ కాస్త రివేంజ్ డ్రామాగా మారుతుంది. ఫస్టాఫ్ లో సరదా సరదాగా ఉన్న హీరోహీరోయిన్లు సీరియస్ డ్రామా పండిస్తారు. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కాస్త కన్ఫూజన్ ఉన్నప్పటికీ.. రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గానే అనిపిస్తుంది.

    ఎవరెలా చేశారు?

    ‘బబుల్ గమ్’ మూవీని పేరుకుతగ్గట్టే డైరెక్టర్ ఫస్టాప్ ను అంతా సాగదీశాడు. సెకండాఫ్ మాత్రం బాగానే తీశాడు. మొత్తానికి ఓ ఫీల్ గుడ్ మూవీ చూశామని అనిపిస్తుంది. హీరోహీరోయిన్లు ఇద్దరూ బాగానే చేశారు. రోషన్ మొదటి సినిమానే అయిన లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బాగానే ఉన్నాయి. హీరోయిన్ మానస చౌదరి రొమాంటిక్ సీన్స్ లో ఇరగదీసిందనే చెప్పాలి. మిగతా సీన్లలో ఫర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్ర (చైతు జొన్నలగడ్డ) మంచి కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేశాడు. ఇక డైరెక్టర్ రవికాంత్ గతంలో ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ లతో మెప్పించాడు. కానీ ఈ మూవీలో కాస్త క్లారిటీ మిస్సయ్యాడు. అయినా కొత్త వాళ్లతో మంచి అవుట్ పుట్ రాబట్టగలిగాడు. ఇక మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది. ‘జిలేబీ’ పాట బాగుంది. బీజీఎం అక్కడక్కడ డామినేట్ చేసినట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

    రేటింగ్: 2.5

    Share post:

    More like this
    Related

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Heroes Fight : ఇయర్ ఎండ్ లో సింగర్, యాంకర్ కొడుకుల ఢీ..

    New Heroes Fight : ఇండస్ట్రీలోకి ఇద్దరు కొత్త నటులు ఎంట్రీ...