37.3 C
India
Tuesday, May 21, 2024
More

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Date:

    Jr NTR
    Jr NTR

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా ‘దేవర’ ఇది సీక్వెల్ గా వస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ‘దేవర: పార్ట్1’ షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. ఇక రిలీజ్ కు సన్నాహాలు చేయాలంటూ మేకర్స్ చెప్తున్నారు. దీనిపై యంగ్ టైగర్, హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒక విషయం చెప్పారు.

    ఈ పాన్ ఇండియా మూవీలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించగా, గ్రిప్పింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎక్స్ ట్రార్డినరీ మ్యూజికల్ స్కోర్ కూడా ఉంది. అభిమానులతో తన హృదయపూర్వక అనుబంధానికి పేరుగాంచిన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ వారితో మమేకమవుతూ, కృతజ్ఞత వ్యక్తం చేస్తూ, తన ఆలోచనలను పంచుకుంటారు.

    రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ జూనియర్ ‘దేవర: పార్ట్ 1’ గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎదురుచూడడం విలువైనదే కాదు.. వారిలో గర్వాన్ని నింపుతుందని చెప్పి వారిని భావోద్వేగానికి గురిచేశాడు. ‘దేవర కోసం ఎదురుచూపులు ఫలిస్తాయని, సినిమా విడుదలయ్యాక ప్రతి అభిమాని గర్వంగా కాలర్ ఎత్తుకుంటారని మీ అందరికీ నా వాగ్దానం’ అని అన్నారు.

    ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గోవాలో ఈ సినిమా కోసం ఓ పాటను చిత్రీకరించగా, తెరవెనుక ఉన్న ఫొటోను చిత్రబృందం షేర్ చేసింది. 2016లో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న రెండో సినిమా ఇది. ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది చివర్లో అంటే అక్టోబర్ లో విడుదల చేయనున్నారు.

    కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర’ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా, దసరా వీకెండ్ సందర్భంగా 2024, అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

    Share post:

    More like this
    Related

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    Amma App : మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్

    Amma App : మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్...

    Rayadurgam : రాయదుర్గంలో.. బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం

    Rayadurgam : రాయదుర్గంలోని ప్రసన్న వేంకరమణుడి కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఓ...

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...