33.1 C
India
Wednesday, May 22, 2024
More

    Star Players : స్టార్ ప్లేయర్స్ కు ఏమైంది.. కోట్లు పెట్టి కొన్న వారి ప్రభావమెంత

    Date:

    Star Players
    Star Players

    Star Players : ఐపీఎల్ సీజన్ 16 కోసం ప్రాంచైజీలు రూ. కోట్లు కుమ్మరించి విదేశీ ఆటగాళ్లతో పాటు స్వదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లు పెట్టి కోల్ కతా కొనుగోలు చేసింది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్ ల్లో స్టార్క్ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. ఏకానమీ కూడా బీభత్సంగా ఉంది. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మ్యాక్సీ, కెమెరూన్ గ్రీన్ ఇద్దరూ దారుణంగా విఫలమవుతున్నారు. గ్రీన్ ను ఆర్సీబీ 17.5 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆల్ రౌండర్ గా బౌలింగ్, బ్యాటింగ్ లో పనికొస్తాడని తీసుకుంది. కానీ ఇప్పటి వరకు అయిదు మ్యాచ్ లు ఆడిన గ్రీన్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు.  బ్యాటింగ్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మ్యాక్స్ వేల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆడిన అయిదు మ్యాచ్ ల్లో ఒక్క సారి కూడా 30 పరుగులు చేయలేదు. బౌలింగ్ లో కూడా రాణించడం లేదు. దీంతో జట్టుకు భారంగా మారాడు.

    ఆర్సీబీ నుంచే మహామ్మద్ సిరాజ్ ఫామ్ కోల్పోయి భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఆర్సీబీ బౌలర్ల ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. శిఖర్ దావన్, సామ్ కర్రన్, గిల్, హర్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్య, మార్కస్ స్టోనియిస్, ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ బ్యాట్స్ మెన్స్, బౌలర్లు తేలిపోతున్నారు.

    వీరందరూ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లే. వీరి నుంచి ఆయా ప్రాంచైజీలు, అభిమానులు భారీ ఇన్సింగ్స్ ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే వేలంలో తక్కువ ధరకు అమ్ముడు పోయిన ఆటగాళ్లు అదరగొడుతున్నారు. దీంతొ క్రికెట్ అభిమానులు అన్ని కోట్లు పోసి కొనే కంటే స్థానిక క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తే వారు తామేంటో నిరూపించుకుంటారని సలహా ఇస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Kiara Advani : ఫొటో గ్యాలరీ: ఆరంజ్ డ్రెస్ లో కియారా.. అందం చూడతరమా!

    Kiara Advani : ఫ్రెంచ్ రివేరాలో పండిపోయిన కియారా అద్వానీ కేన్స్‌లో...

    KKR Vs SRH : కోల్ కతా ఫైనల్ కు.. సన్ రైజర్స్ మరో చాన్స్ 

    KKR Vs SRH : కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్...

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KKR Vs SRH : కోల్ కతా ఫైనల్ కు.. సన్ రైజర్స్ మరో చాన్స్ 

    KKR Vs SRH : కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    Jake Fraser McGurk : ఈ భీకర ప్లేయర్ బెంచ్ కే పరిమితం.. ఆసీస్ బోర్డుపై రికీ పాంటింగ్ విమర్శలు

    Jake Fraser McGurk : జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఢిల్లీ...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...