39.1 C
India
Monday, May 20, 2024
More

    AP CM Jagan : జగన్ ని ఆదర్శంగా తీసుకుంటే అంతే.. ప్రతిపక్షాలకు ఇక నో చాన్స్..

    Date:

    AP CM Jagan :

    ఏపీలో వైసీపీ ప్రభుత్వం పాలన ఎంత ఘోరంగా ఉందో, ఆయన ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్లకుండా ఆయన చేస్తున్న ఎదురుదాడులు అందరినీ విస్మయానికిగురి చేస్తున్నాయి. నిజానికి అన్ని రాష్ర్టాల్లో ఇలాగే కొనసాగితే ఇక ప్రతిపక్షాలు అనేవే ఉండవు. తనకు అనుకూలంగా లేని పత్రికాధిపతులను టార్గెట్ చేయడం ఒక్క ఏపీకే పరిమితం కాకపోయినా, ఇక్కడ దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉందనేది మీడియా రంగ నిపుణుల అభిప్రాయం. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రాంతీయ పేపరుగా ఈనాడు కు పేరుంది. అలాంటి సంస్థ యజమాని రామోజీరావును కూడా ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనేది తెలుగు రాష్ర్టాల్లో టాక్ నడుస్తున్నది.

    ఇక స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆధారాల్లేకున్నా టీడీపీ అధినేత ను అరెస్ట్ చేయడం, సీఎం జగన్ కక్ష ధోరణిని తెలియజేస్తున్నదని అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. స్కిల్ సెంటర్లు ఎదురుగా కనిపిస్తున్నా, అసలు కేంద్రాలే ఏర్పాటు చేయలేదని వాదించడం, పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా చేసిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం వెనుక ఎంతో కుట్ర ఉందో అర్థమవుతున్నదని పేర్కొంటున్నారు. ఇక లేని రింగ్ రోడ్డు మీద కూడాకేసులు పెట్టి వేధించాలని చూడడం జగన్ మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని మండిపడుతున్నారు. ఇక 38 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి, బాబాయ్ హత్య నిందితులను కాపాడుతున్న వ్యక్తిగా జగన్ పై ముద్ర పడిందని, ఇలాంటి వ్యక్తిని నమ్మినందుకు ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని ప్రజలే మాట్లాడుకుంటున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.

    దర్యాప్తు సంస్థలనును అడ్డుపెట్టుకొని ఇలా ప్రతిపక్ష పార్టీలే లేకుండా చేయాలని  ఏపీ సీఎం  జగన్ ప్రవర్తిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దమ్ముంటే వైసీపీ మంత్రుల అవినీతిపై విచారణ చేయించాలని సవాల్ విససురుతున్నారు. ఏదేమైనా జగన్ చర్యలు భవిష్యత్ లో అధికారంలోకి వచ్చే పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకుంటే, ఇక ప్రతిపక్షాల పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుంది. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వైసీపీ నేతల పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుందని టీడీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంగా జగన్ ను నమ్ముకొని వెళ్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడం ఖాయం. ఏదేమైనా జగన్ ప్రవర్తన దేశంలోని అన్నివ్యవస్థల డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట దర్యాప్తు సంస్థల వ్యవహార శైలిపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటికి ఆజ్యం పోసేలా ఆ సంస్థల వ్యవహార శైలి కూడా ఉంటుంది. ఇలంటి సందర్భంలో రానున్న రోజుల్లో ఇక ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఏపీకి మరింత గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    Indian 2 : ‘భారతీయుడు 2’ స్టోరీ ఇదే.. భారీ స్కెచ్ తో వస్తున్న శంకర్..

    Indian 2 : తమిళ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...