Automatic Vs Manual : కొవిడ్ తర్వాత భారత్ లో ఆటో మేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్లకు గిరాకీ పెరిగింది. చాలా మంది వీటి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. డ్రైవింగ్ చేసేందుకు సులువుగా ఉండడంతో పాటు ట్రాఫిక్ లో తరచుగా గేర్లు మార్చడం, క్లచ్ అవసరం ఉండదని వీటి వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ వాహనాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, భారత్ లో మెజార్టీ పీపుల్.. మాన్యువల్ ట్రాన్స్మిషన్ (చేతితో గేర్లు వేసుకోవాలి) కార్లనే వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.
ధర విషయంలో..
ఇండియాలో ఎక్కువ మంది మ్యానువల్ కార్లపై మొగ్గు చూపేందుకు ప్రధాన కారణం ధర కూడా అని నిపుణులు చెప్తున్నారు. AMT కార్లతో పోల్చితే మాన్యువల్ కార్ల ధర తక్కువ. స్పిన్నీ అనే సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం.. మాన్యువల్ కారు కంటే ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ధర రూ. 80 వేల వరకు ఎక్కువ. కొనుగోలుదారు AMTకి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంటోంది.
బీమా ఖర్చులు..
AMT గేర్‌బాక్స్ సాంకేతికత కారణంగా కారు అధిక ధర పలికి కొనుగోలు దారు ఇన్సూరెన్స్ ఖర్చులను పెంచడంతో వాహనం మరింత ప్రయం అవుతుంది. ఈ వ్యత్యాసం ఎంట్రీ లెవల్ వాహనాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ కారణంగా చాలా మంది స్టిక్కర్ ధర, బీమా ఖర్చులపై డబ్బు ఆదా చేసేందుకు కూడా మాన్యువల్ ను ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
మెయింటెనెన్స్ ఖర్చు..
ఎక్కువ మంది మాన్యువల్ వైపు ఇంట్రెస్ట్ చూపించేందుకు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా కారణమని నిపుణులంటున్నారు. ఎందుకంటే AMT నిర్వహణ గేర్ బాక్స్ నిర్వహణ కంటే ఖరీదైనది. మాన్యువల్ ట్రాన్సి మిషన్ల కంటే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లు చాలా క్లిష్టమైన నిర్మాణం కలిగి ఉంటాయి. ఫలితంగా నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. AMT కార్లతో పోల్చితే మాన్యువల్ లో రెగ్యులర్ ఆయిల్ మార్చడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.
విశ్వసనీయత..
మాన్యువల్ గేర్ బాక్స్ కంటే AMT తక్కువ విశ్వసనీయత కలిగి ఉండడం కూడా ఎక్కువ మంది మాన్యువల్ తీసుకోవడాని ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మాన్యువల్ గేర్ బాక్స్ టెక్నికల్ గా డెవలప్ అయ్యింది. AMT కంటే ఎక్కువ కాలం నుంచి అమల్లో ఉంది.
వేడెక్కడం, జెర్కీ రైడ్లు
ట్రాఫిక్ ప్రాంతాల్లో AMT కార్లలో ట్రాన్స్‌మిషన్ వేడెక్కుతుంది. డ్రైవ్ మోడ్‌లో డ్రైవర్ బ్రేక్‌పై పాదాలు ఉంచడం ద్వారా వేగం తగ్గించాలి. అదే.. మాన్యువల్ కు ఈ సమస్య ఉండదు. ఆటోమెటెడ కంటే మ్యానివల్ డ్రైవింగ్ అనుభవంపై ఎక్కువ నియంత్రణ అందిస్తాయి. ఇన్ని కారణాల దృష్ట్యా ఇండియాలో కార్లవర్స్AMT కంటే మ్యానువల్ నే ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.