21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Delhi Mumbai Expressway : భారత కలల ప్రాజెక్ట్ సాకారం దిశగా..

    Date:

    • ఇక త్వరలోనే అందుబాటులోకి ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ హైవే
    delhi mumbai expressway
    Delhi Mumbai Expressway

    Delhi Mumbai Expressway :ముంబై ఢిల్లీని కలుపుతూ  12 గంటల్లోనే చేరుకునే ఇండియా డ్రీమ్ ఎక్స్ ప్రెస్ హైవే త్వరలోనే సాకారం కానున్నది. గంటకు120 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోయేలా ఈ హైవే జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. 50 ఏండ్ల పాటు పనిచేసేలా నిర్మిస్తున్న ఈ హైవే త్వరలోనే అందుబాటులోకి రానుండగా, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అటవీ ప్రాంతాల్లో జంతువులు రోడ్డు దాటేందుకు అనుకూలంగా ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా అండర్ పాస్ లను నిర్మిస్తున్నారు. ముడుచుకునే వంతెనలను కూడా నిర్మస్తున్నారు.

    ప్రత్యేకతలివే..

    ఎనిమిది లైన్లతో నిర్మిస్తు్న్న ఈ ఎక్స్ ప్రెస్ హైవే 12 లైన్లతో సరిపోలేలా 1350 కిలోమీటర్లు ఉంటుంది. 24 గంటల ప్రయాణాన్ని 12 గంటల్లోనే చేరుకునేలా ఈ జర్నీ సాగనుంది. 130 కిలోమీటర్ల ప్రయాణం తగ్గించునంది. హర్యానా, రాజస్థాన్, గుజరాత్ , మధ్యప్రదేశ్, మహారాష్ర్టలను కలుపుకుంటే ఈ ఎక్స్ ప్రెస్ హైవే వెళ్తుంది. గురుగాం, మీవాత్, రంతమ్బోర్, కోట, వడోదర, సూరత్, ముంబైలను కలుపుతుంది. ఎక్స్ ప్రెస్ ప్రవేశంలో ఎలాంటి టోల్ ఉండదు. ప్రతి ఎగ్జిట్ వద్ద టోల్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణించిన దూరం, సమయంను బట్టి టోల్ చార్జీ ఉండనుంది. అగ్ర- లక్నో ఎక్స్ ప్రెస్ హైవేలో కిలోమీటరుకు రూ.  2.45 వసూలు చేస్తున్నారు. ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ హైవే లో మాత్రం కిలోమీటరుకు 65 పైసలు మాత్రమే వసూలు చేయనున్నారు.

    రాష్ట్రాల వారీగా ఈ హైవే ఖర్చు ఇలా ఉంది..

    ఢిల్లీలో 9 కిలోమీటర్లు ఉండగా రూ.1800 కోట్ల బడ్జెట్ కేటాయించారు. రూ.10,400 కోట్లు హర్యానాలో 160 కిలోమీటర్ల కోసం కేటాయించారు. రూ.16,600 కోట్లు 374 కిలోమీటర్ల కోసం రాజస్థాన్లో కేటాయించారు. రూ. 11,100 కోట్లు 245 కిలోమీటర్ల కోసం మధ్య ప్రదేశ్లో,  423 కిలోమీటర్ల కోసం రూ. 35,100 కోట్లు గుజరాత్లో, 23000 కోట్లు 171 కిలో మీటర్ల కోసం మహారాష్ర్టలో కేటాయించారు. ప్రతి 500 మీటర్ల దూరంలో సీసీ కెమెరాను అమర్చారు. 93 ప్రాంతాల్లో రెస్ట్ ఏరియాలను ఏర్పాటు చేశారు. 50 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ను అందుబాటు లో ఉంచారు. ఇది ఏషియాలోనే మొదటి గ్రీన్ వైల్డ్ లైఫ్ హైవేగా పేరొందింది.  జంతువులు వెళ్లేందుకు వీలుగా పలు అండర్ పాస్ లు నిర్మించారు. మోదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nitin Gadkar : ఇక హైవేలపై ఆ సౌకర్యాలు కూడా.. నితిన్ గడ్కర్ సంచలన ప్రకటన..

    Nitin Gadkar : భారతీయ రోడ్లను ప్రపంచంలోనే అత్యాధునిక, సౌకర్యవంత రోడ్లుగా...