37 C
India
Monday, May 20, 2024
More

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    Date:

    AP Election Campaign
    AP Election Campaign

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడింది. ప్రజలు ఓటు వేయడానికి మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 13న ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రములోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

    వైసీపీ నేత జగన్ తీరిక లేకుండా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సమయాన్ని వృధా చేయకుండా రాత్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రోజుకు ఒక జిల్లా చొప్పున, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రోడ్ షో లతో పాటు, బస్సు యాత్ర లతో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

    మే 11 న సాయంత్రం తో నాయకుల ప్రచారం ముగుస్తుంది. సమయం తక్కువగా ఉండటంతో వివిధ పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల , వైసీపీ నేత జగన్ క్షణం తీరిక లేకుండా పోటీపడి ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటుచేసిన సభలో జగన్ పాల్గొనేవిదంగా ఏర్పాట్లు చేసారు. అనంతరం మధ్యాహ్నం బయలుదేసి నగరి నియోజకవర్గంలో రివహించే రోడ్ షో  లో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం కడపలో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

    తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు ప్రాంతాల్లో నిర్వహించే సభలు, రోడ్ షో లలో పాల్గొని ప్రసంగించనున్నారు. కూటమి నాయకులు పాల్గొనే ప్రతి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వైసీపీ సభల కంటే జనం అధికంగా వచ్చే విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనం తరలింపులో కూటమికి చెందిన నాయకులు గల్లీ నుంచి మొదలుకొని నియోజకవర్గం స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్కరు భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ సాధించాలనే పట్టుదలతో కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...