37.3 C
India
Tuesday, May 21, 2024
More

    Star Actor : ఏసీ రిపేరర్ కట్ చేస్తే.. స్టార్ యాక్టర్

    Date:

    Star Actor
    Star Actor

    Star Actor : అదృష్టం అంటేనే కలిసిరావడం. చేసే పని కలిసి రాకపోవడంతో కొందరు నిరుత్సాహానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో నా అదృష్టం బాగులేదు. నా జాతకం సరిగా లేదు. నా అదృష్టమే ఇంత. నేను ఏది చేసినా కలిసి రాదంట నా జాతకం ప్రకారం. అంటూ కొందరు జీవితంలో వెనుకబడి పోయి, ఆర్థికంగా నష్టపోయిన వారు కొందరు నిరాశ,నిస్పృహతో కాలం  వెల్లదీస్తారు. కానీ ఆలా ఆవేదన పడుతూ ఉన్నవారికి కూడా ఏదో ఒక రోజు అదృష్టం అనేది ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది. ఇది చాలా మందికి తెలుసు. కానీ చేస్తున్న పనిలో కష్టం కూడా ఉండాలి. కష్టం లేనిదే సుఖం దొరకదు.

    సినిమా ఇండస్ట్రీలో ఒక రజనీకాంత్, చిరంజీవి, ఎన్టీ రామారావు, వ్యాపారరంగంలో టాటా, బిర్లా, అనిల్ అంబానీ ఇలా ఎందరో ఆర్థికంగా దేశం దాటిపోయి తమ వ్యాపారాలను  విస్తరించారు. తొందరగా సంపాదన పెరగాలని కొందరు దేవుళ్ళకి మొక్కుతారు. ప్రత్యేకంగా పూజలు, హోమాలు చేస్తారు. వ్రతాలు చేసి అన్నదానం చేసి అదృష్టం కోసం ఎదురుచూస్తారు. కానీ సరైన ఫలితం రాకపోయేసరికి నిరాశ, నిస్పృహతో కుంగిపోతారు.

    ఆలా భాదపడుతున్న వారి జాబితాలో ఓ ఏసీ మెకానిక్ సైతం ఉన్నారు. ఆ ఏసీ మెకానిక్ అదృష్టం తిరగబడింది. అనుకోకుండా ఒక స్టార్ హీరోగా ఎదిగాడు.  ఏసీ మెకానిక్ చేసి జనాలకు చల్లని వాతావరణాన్ని ఇస్తారో, నటుడిగా థియేటర్లో ప్రేక్షకులకు కూల్ కూల్ గ మెప్పిస్తూ ఎక్కడికో ఎదిగిపోయారు. అతని ఏసీ రిపేర్ నుంచి సినిమా ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది.

    ఇర్ఫాన్ ఖాన్ అనే కుర్రాడు ముందుగా ఒక ఏసీ మెకానిక్. తన కుటుంబ సభ్యుడి ప్రోద్బలంతో నటనవైపు వెళ్లాడు.  1988 లో సలాం బాంబే సినిమాతో హిందీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎదిగారు ఇర్ఫాన్ ఖాన్. విలక్షణ నటుడిగా రాణించారు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. తెలుగులో మహేష్ బాబుతో నటించి తన అభిమానులను మెప్పించారు. 30 ఏళ్ల సినిమా ప్రయాణంలో జాతీయ అవార్డు తోపాటు మరెన్నో అవార్డులను దక్కించుకున్నారు ఇర్ఫాన్ ఖాన్.

    Share post:

    More like this
    Related

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    Amma App : మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్

    Amma App : మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్...

    Rayadurgam : రాయదుర్గంలో.. బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం

    Rayadurgam : రాయదుర్గంలోని ప్రసన్న వేంకరమణుడి కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఓ...

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related