‘Neymar’ : మళయాల సినిమాల కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక సినిమా కథ, కథనంను మలచడంలో వారు అప్ డేటెడ్ గా ఉంటారు. గతంలో ‘చార్లీ 777’ సినిమాలో కథ మొత్తం కుక్క చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో కూడా కథ కుక్కు చుట్టూ తిరుగుతుంది కానీ ఇందులో పంతాలు పట్టింపులు కూడా ఉంటాయి. క్లైమాక్స్ అయితే కన్నీరు పెట్టించడం ఖాయం. ఆ సినిమా విశేషాలను ఇక్కడ చూద్దాం.
‘నెయిమర్’ ఈ సినిమా మే 12న థియేట్రికల్ రిలీజై విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా ఓటీటీ ప్లాట్ ఫారం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆగస్ట్ 8 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మాథ్యూ థామస్, నస్లెన్, షమ్మీ తిలకన్, జానీ ఆంటోని, విజయరాఘవన్ నటించారు. మాడిసన్ సుధీ దర్శకత్వం చేశారు. కథ గురించి తెలుసుకుంటే
ఇద్దరు ఫ్రెండ్స్ కుంజవ (మాథ్యూ థామస్), సింటో (నస్లెన్) ఇద్దరికీ ఫుట్ బాల్ అంటే ఇష్టం. వారి తండ్రుల కూడా ఒకప్పుడు మంచి స్నేహితులు మనస్పర్థలతో విడిపోతారు. వారి కొడుకులైన కుంజవ, సింటో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలని కలలు కంటారు. కుంజవ డోనా అనే అమ్మాయి ప్రేమలో పడతాడు.
డోనాకు కుక్క పిల్లలంటే ఇష్టం ఈ విషయాన్ని తెలుసుకున్న కుంజవ వీధి కుక్కను తీసుకస్తాడు. ఆ కుక్కపేరు సినిమా లైటిల్ ‘నెయిమర్’. అది వచ్చిన కొన్ని రోజులకు వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అసలు ఏమవుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే. మూవీ ఫస్ట్ లో కొంత కుంజవా, సింటో కుటుంబాలను పరిచయం చేశాడు దర్శకుడు. ఆ తరువాత కథ అంతా కుక్క చుట్టూనే తిరుగుతుంది.
సెకండాఫ్ లో గాబ్రియల్ కు వెంకట్ తో ఉన్న విరోధం, ఇద్దరి మధ్య కొనసాగుతున్న వార్. పరువు, ప్రతిష్ఠలు ‘నెయిమర్’ అనే కుక్కపిల్లపై ఎలా ముడిపడి ఉన్నాయి అనేది సస్పెన్స్ తో నడుస్తుంది. ఇక సినిమా క్లైమాక్స్ చేరుకుంటుడడంతో ఎమోషనల్ టచ్ మొదలవుతుంది. ప్రతీ సీన్ కన్నీటిని తెప్పస్తుంది.