Pallavi Prashanth : బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను మించిన డ్రామా ఆర్టిస్ట్‌లు ఉండరేమో.. బిగ్ బాస్ హౌస్‌లో వంద రోజుల పాటు వీళ్లు ఆడే నాటకాలు.. డ్రామాలు అబ్బో.. మామూలుగా ఉండవుగా.. అది పూర్తయిన తర్వాత ఇలా మరో డ్రామా.. మొత్తానికి వారిలోని కళాకారులను బయటకు తీస్తూనే ఉంటారు. ప్రతీ సీజన్ ముగిసిన తర్వాత ‘బీబీ ఉత్సవ్’ పేరుతో స్పెషల్ ప్రోగ్రాం చేస్తారు. ఈ ప్రోగ్రాంకు హౌస్‌లోని కంటెస్టెంట్స్ ను పిలుచుకొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ల పర్ఫార్మెన్స్ చూడాలి స్వామి.. మామూలుగా ఉండదుగా.. ఒకరిని మించి మరొకరు.. తెగ పెర్ఫామ్ చేస్తుంటారు.
ఫిబ్రవరి 18 ఆదివారం రోజున సాయత్రం 6 గంటల నుంచి స్టార్ మాలో ఈ ‘బీబీ ఉత్సవ్’ ప్రసారం కానుండగా.. దీని ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. 7 నిమిషాల నిడివితో ఉన్న ఈ ప్రోమోలో గురు, శిష్యులు శివాజీ, పల్లవి ప్రశాంత్ జీవించారు. వాళ్లు ఏడుస్తూ.. అందరినీ ఏడిపించారు.
ఇక అమర్ దీప్‌ను ఏలా వెధవని చేసి ఆడుకున్నారో.. ప్రోమోలోనూ అలానే చేశారు. హౌస్‌లో ఉన్నప్పుడు అమర్ పతనాన్ని కోరుకొని ఎంత దిగజార్చాలో అంతా దిగజార్చిన శివాజీ.. ఇక్కడ మాత్రం.. ‘నేను అమర్ గెలవాలని కోరుకుంటున్నా’ అన్నాడు. చివరికి ఈ టాస్క్‌లో అమర్ ఓడిపోవడంతో.. ‘బ్యాడ్ లక్ రా..’ అంటూ సెటైర్లు వేశాడు. అప్పుడు సాడ్ సాంగ్ వేయడంతో.. ‘నాకు సాడ్ సాంగ్ వేస్తే పగులుద్ది’ అంటూ పిల్లపిత్తిరి వేశాలేషాడు అమర్ దీప్. అంత డ్యామేజ్ జరిగినా మనోడిలో మార్పురాలేదు.
హౌస్‌ని లవర్స్ పార్క్‌లా మార్చేసి.. ఫస్ట్ ఆఫ్ లో తెగ ప్రేమించుకొని సెకండాఫ్‌లో అక్కా తమ్ముళ్లుగా మారిన దరిద్రపు గొట్టు జంట రతిక, పల్లవి ప్రశాంత్ స్టేజీపై ఉట్టి మీద కూడూ అంటూ పెర్ఫామెన్స్ చేశారు. స్టేజ్‌పై ప్రశాంత్‌కు సారీ చెప్పి హగ్ ఇచ్చింది రతిక. ఆ తర్వాత కుమారీ ఆంటీని స్టేజ్ మీదికి తీసుకువచ్చారు.
చివరలో శివాజీ, పల్లవి ప్రశాంత్, నయని పావని ఏడిపించేశారు. ‘నాన్న ప్రేమకి దూరమైన నాకు ఓ మంచి మనిషి గిఫ్ట్‌గా వచ్చారు.. ఆయనే శివాజీ’ అంటూ పెర్ఫామెన్స్ చేసి ఏడిపించేసింది. తండ్రి లేకపోతే నరకం.. మా నాన్న లేని లోటును చూస్తున్నా అంటూ శివాజీ కన్నీరు పెట్టుకున్నాడు.
పల్లవి ప్రశాంత్ అయితే.. ‘నేను టైటిల్ గెలిచినప్పుడు మా నాన్న కళ్లలో సంతోషం చూడాలని అనుకున్నా.. కానీ నేను జైలుకి వెళ్లిన తర్వాత మా నాన్న కోర్టు బయటపడుకున్న వీడియో చూస్తే.. నేనెందుకు బతికున్నానా అనిపించింది.. చాలా బాధగా ఉంది’ అంటూ ఏడ్చేశాడు. హౌజ్ లో వీళ్ల డ్రామా ఎక్కువగా చూసిన ప్రభావమో.. ఏమో తెలియదు కానీ.. వీళ్లు ఏడుస్తున్నా.. నవ్వుతున్నా.. నాటకాల్లాగే అనిపిస్తుంది. ఇందులో రియల్ ఎమోషన్ అయితే కనిపించడం లేదు.