41.1 C
India
Monday, May 20, 2024
More

    PM Modi : ఏ దేశ ప్రధాని, అధ్యక్షుడికి దక్కని రికార్డు.. మోడీ సొంతం.. అదేంటంటే!

    Date:

    PM Modi
    PM Modi

    PM Modi : ప్రపంచంలో కొన్ని దేశాలకు అధ్యక్షులు, మరి కొన్ని దేశాలకు ప్రధానులు ఉంటారు. వారందరిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పంథా వేరు. ఆయన 2014లో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ కు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. అప్పటి నుంచి ప్రపంచంలోని చాలా దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఆయనను అభినందించడం మొదలు పెడుతున్నారు. ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన మోడీ దేశాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇటీవల ఆర్థిక రంగంలో దేశాన్ని ప్రపంచలోనే 5వ స్థానంలో నిలిపాడు. కొవిడ్ తో బాధపడుతున్నా చాలా చిన్న చిన్న దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్ ను పంపించి అతిపెద్ద మానవతా మూర్తిగా నిలిచాడు. పొరుగున్న ఉన్న దాయాది దేశాలైన పాకిస్తాన్, చైనాలను కట్టడి చేసేందుకు అనేక వ్యూహాలను అవలంభిస్తున్నాడు.

    ఇతర దేశాల పార్లమెంట్లలో అత్యధికంగా ప్రసంగాలు చేసిన దేశ ప్రధానిగా మోడీ గతంలోనే రికార్డును సొంతం చేసుకున్నారు. అమెరికా పార్లమెంట్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ కు దేశం యావత్తు ఫిదా అయ్యింది. ఇతర దేశాలకు టూర్ కు వెళ్లిన సమయంలో ఎయిర్ పోర్ట్ కు వచ్చే ఇండియన్స్ ను ఆయన దగ్గరగా వెళ్లి పలకరిస్తారు. వారితో కరచాలనం చేస్తారు. సలహాలు, సూచనలు తీసుకుంటాడు. ఆ దేశంలో వారి కష్టాలు, నష్టాలను అక్కడి ప్రభుత్వాలతో చర్చించి పరిష్కరిస్తాడు. ఇలా ప్రపంచంలో మారుమూల ఉన్న ఏ దేశానికి వెళ్లినా భారత ప్రధాని మోడీ గురించి ఆ దేశాధినేతలు గర్వంగా చెప్పుకుంటారు.

    సోషల్ మీడియాలో కూడా ప్రధాని మోడీ రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. టెక్నాలజీతోనే కష్టాలు తీరుతాయని బాగా విశ్వసిస్తారు ఆయన. అందుకే ఆయన హయాంలోనే 5G రావాలని అందుకు కృషి చేయాలని టెక్ సైంటిస్టులకు ఫ్రీడం ఇచ్చాడు. 5G తర్వాత దేశం మరింత ముందుకు దూసుకెళ్తుంది. ఇవన్నీ పక్కన ఉంచితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ప్రధానికి ‘నరేంద్ర మోడీ’ యూ ట్యూబ్ ఛానల్ లో 2కోట్ల మంది సబ్ స్ర్కైబర్స్ ఉన్నారు.

    2 కోట్ల మంది ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన దేశాధినేతగా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి నేతగా ప్రధాని మోడీ చరిత్రలో నిలిచారు. దీంతో మోడీకి ప్రపంచంలోని వివిధ దేశాధి నేతలతో పాటు దేశంలోని నాయకులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఛానల్ ద్వారానే మోడీ తన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు.

    Share post:

    More like this
    Related

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...