39.1 C
India
Monday, May 20, 2024
More

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    Date:

    America
    Telugu Student Missing-America

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గతంలో హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ మహ్మద్‌, ఈ సంవత్సరం ప్రారంభంలో నీల్ ఆచార్య ఘటనలు USలో నేరాలకు పాల్పడే విద్యార్థుల దౌర్భల్యాన్ని నొక్కి చెబుతున్నాయి. ఇప్పుడు, నాలుగు రోజులుగా విస్కాన్సిన్‌లోని మిల్వాకీ నుంచి రూపేష్ చంద్ర చింతకింది మిస్ అయ్యడు.

    తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగోలో అదృశ్యమయ్యాడు. వారంగా అతడి ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

    ‘భారత్‌కు చెందిన విద్యార్థి రూపేశ్‌ చంద్ర చింతకింది ఆచూకీ మే 2 నుంచి కనిపించడం లేదని తెలిసి కాన్సులేట్‌ ఆందోళన చెందుతోంది. అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులు తీవ్రంగ గాలిస్తున్నారు. త్వరలో అతని జాడ తెలుస్తుందని ఆశిస్తున్నాం’ అని షికాగో భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలిపింది. అక్కడి పోలీసులు కూడా దీనిపై ప్రకటన చేశారు. అతడి గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులకు ఆనవాలు పంపించారు.

    తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేష్ స్థానిక పాఠశాల విద్యను అభ్యసించాడు. అనంతరం వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు. వరంగల్ నుంచి కాంకోర్డియా యూనివర్సిటీ విస్కాన్సిన్‌కు వెళ్లాడు. అతని మిస్సింగ్ తో తల్లిదండ్రులు ఆందోళన చెందడంతో పాటు ‘తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని’ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా (USA) ఎంబసీని అభ్యర్థిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...