41.1 C
India
Monday, May 20, 2024
More

    TTD Bus Theft : హతవిధీ.. తిరుమలలో తిరుమలేషుడికే దిక్కులేదా?

    Date:

    ttd electric bus theft tirumala
    TTD electric bus theft in Tirumala

    TTD Bus Theft :

    దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. మనకు ఏదైనా నష్టం జరిగితే దేవుడిని ప్రార్థిస్తాం. కానీ దేవుడి ఆస్తులే అపహరణకు గురైతే ఇక ఎవరికి చెప్పుకోవాలి. గోవిందా.. గోవిందా అంటూ ఉండిపోవాల్సిందేనా? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు కొండపైకి మళ్లీ అక్కడి నుంచి కిందకు తరలించేందుకు  పది ఎలక్ర్టికల్ బస్సులను ఏర్పాటు చేసింది.
    ఇవి రోజు భక్తులను చేరవేస్తూ సేవలు అందిస్తుంటాయి. పగలు సేవలందిస్తూ రాత్రి పూట స్థానిక స్వామి వారి రవాణా కార్యాలయం వద్ద నిలుపుతుంటారు. అక్కడే చార్జింగ్ పెడతారు. కానీ నిన్న రాత్రి 3.53 గంటల సమయంలో బస్సును దొంగిలించారు. ఉదయం రవాణా శాఖ అధికారులు గుర్తించి క్రైమ్ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వారు వచ్చి సీసీ కెమెరాలు, జీపీఎస్ ద్వారా బస్సు నాయుడుపేట బిరుదవాడకు సమీపంలో టిడ్కో ఇళ్ల వద్ద రహదారిపై వదిలి వెళ్లినట్లు గుర్తించారు.
    పోలీసులు వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. తిరిగి కార్యాలయం వద్దకు చేర్చారు. రవాణా శాఖ కార్యాలయం వద్ద తగిన భద్రత సిబ్బంది లేకపోవడంతోనే బస్సును సులభంగా చోరీ చేశారనే వాదనలు వస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే బస్సు  చోరీకి గురైనట్లు తెలుస్తోంది. వారం కిందట టీటీడీ కి చెందిన ఓ ఎలక్ర్టిక్ కారున చోరీ చేసినట్లు తెలిసింది.
    కడప సమీపంలోని ఒంటిమిట్ల ఆలయం వద్ద వాహనాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో అధికారులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు పోలీసులు దీనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఇలా దేవుడి ఆస్తులకు విలువ లేకుండా పోవడం చూస్తుంటే ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Thirumala: ఏప్రిల్ నెల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

        తిరుమల: తిరుమల శ్రీవారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ...

    THIRUMALA: కమ్మేసిన మంచు.. తిరుమలలో అద్భుత దృశ్యమాలిక

    తిరుమల తిరుపతి దేవస్థానం ను మంచు కమ్మెశింది. శ్రీవారి ఆలయంతో పాటు...

    Bhanu Prakash Reddy Comments : తిరుమలలో వరుస దొంగతనాలు.. బీజేపీ నేత హాట్ కామెంట్స్..

    Bhanu Prakash Reddy Comments : ఏపీలోని తిరుమలలో ఇటీవల వరుస దొంగతనాలు...