37.2 C
India
Monday, May 20, 2024
More

    YCP : వైసీపీ విషయంలో బీజేపీ గుట్టు బయటపడుతుందా?

    Date:

    YCP BJP
    YCP BJP
    YCP : 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీతో అంటకాగుతున్నది. కేవలం ఒక్క ఎన్డీఏలో చేరడమే తక్కువ అన్నట్లుగా ఉన్నది. కానీ అనధికారికంగా వైసీపీ బీజేపీకి మిత్రం పక్షంగానే వ్యవహరిస్తున్నదనే విషయం బహర్గతమే.  వైసీపీ ఆగడాలకు బీజేపీ వత్తాసు పలుకుతున్నదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ఎన్ని అక్రమాలకు పాల్పడినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.
    రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలు ఏపీ, తెలంగాణ సెంటిమెంట్స్ తీవ్రంగా ప్రభావితం చేశాయి. 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవడం, జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే ప్రజల నిర్ణయం ఫలితాలను మార్చేశాయి. 2024లో జరుగబోయే ఎన్నికలను సంక్షేమ పథకాలు, అమరావతి రాజధాని, టిడిపి, జనసేన, బీజేపీ పొత్తులు, బీఆర్ఎస్ ఎంట్రీ  ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా వీటికి మరో అంశం కూడా తోడు కాబోతున్నది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం, వలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ)కి ఫిర్యాదు చేయడం.  బాబు సోమవారం ఢిల్లీలో సీఈసీని కలిసి కొన్ని ఫిర్యాదులు చేశారు. 1.ఫారం-7 ద్వారా ఏపీలో 15 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు.
    2.ఏపీలో టీడీపీకి ఓట్లు వేసే వారిని వలంటీర్ల ద్వారా గుర్తించి వారి జాబితాలలో నుంచి తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది నకిలీ ఓటర్లను కొత్తగా చేర్చారు. చనిపోయిన ఓటర్ల పేర్లను కూడా ఆ జాబితాలలో చేర్చారు. ఒకే డోర్ నంబరులో వందల కొద్దీ ఓటర్లను చేర్చడం. 3.వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలని చెప్పినా వైసీపీ ప్రభుత్వం వారి ద్వారానే ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరించడం. వాటిని ప్రైవేట్ ఏజన్సీలకు అప్పగించడం. 4.ఓటర్ల జాబితా పరిశీలన, మార్పులు చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేయాల్సిన పనులను వలంటీర్ల తో చేయిస్తుననా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం 5.ఓటర్ల జాబితాలలో అవకతవకల గురించి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించడం.
    దానిని వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ పనిచేయనీయకుండా అడ్డుపడడం. 6.దేశమంతా అంగన్వాడీ, ఉపాధ్యాయుల ద్వారానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంటే ఏపీలో మాత్రం వలంటీర్ల ద్వారా చేయించడం. 7.ఏపీలో ఈ ఓటర్ల జాబితాలలో అవకతవకలను పరిశీలించేందుకు ఓ ఎన్నికల నిపుణుడు అధ్వర్యంలో ఓ హైపవర్ కమిటీని వేయాలి. దానిలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎన్నికల అధికారులు, ఐఏఎస్ అధికారులను సభ్యులుగా వేయాలి. ఆ కమిటీ ఏపీలో ఈ ఓటర్ల జాబితాలన్నిటినీ పూర్తిగా పరిశీలించిన పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే అది ఎలక్షన్ కాబోదు వైసీపీ సెలక్షన్ అవుతుంది. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు నాయుడు  చేసిన ఫిర్యాదులు, హైపవర్ కమిటీ వేయాలనే సూచనలపై సీఈసీ సీరియస్‌గా తీసుకొని విచారణ మొదలుపెడితే ముందుగా వలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టక తప్పదు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేస్తే వైసీపీ చేర్చిన నకిలీ ఓట్లన్నీ రద్దు కావడం కూడా ఖాయం. ఒకవేళ ఈ రెండూ జరిగితే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి మరీ ఖాయం. కానీ సీఈసీ చంద్రబాబు నాయుడు ఫిర్యాదులపై స్పందించి హైపవర్ కమిటీ వేస్తుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం టీడీపీ, వైసీపీలలో ఎటువైపు మొగ్గుతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందనేది బహిరంగ రహస్యం.

    Share post:

    More like this
    Related

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...