
అమెరికా ఇంటలిజెన్స్ లో భారతీయుడికి చోటు లభించింది. ఇప్పటికే జో బైడెన్ సర్కారులో పలువురు భారతీయులకు చోటు లభించగా తాజాగా ఆ జాబితాలో భారత సంతతికి చెందిన నంద్ ముల్ చందానీకి చోటు లభించింది. ఇంటలిజెన్స్ ఏజెన్సీ లో ఒక భారతీయుడికి చోటు దక్కడం భారతీయులకు గర్వకారణం అనే చెప్పాలి.
ఢిల్లీ లోని పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన నంద్ ముల్ చందానీ సిలికాన్ వ్యాలీలో 25 సంవత్సరాల పాటు సేవలు అందించారు. అలాగే అమెరికా రక్షణ శాఖలో కూడా సేవలందించారు. దాంతో తాజాగా నంద్ ముల్ చందానీని సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమిస్తూ జో బైడెన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.