తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డాలస్ లో జూన్ 25 న శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుకలు ”డాలస్ తెలంగాణ ప్రజా సమితి ” ఆధ్వర్యంలో జరుగనున్నాయి. జూన్ 25 న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. అందుకోసం ఇప్పటి నుండే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.