36.8 C
India
Tuesday, May 21, 2024
More

    ACTOR ALI- JANASENA- YCP :వైసీపీని వీడేది లేదంటున్న అలీ

    Date:

    actor-ali-janasena-ycp-ali-says-he-will-not-leave-ycp
    actor-ali-janasena-ycp-ali-says-he-will-not-leave-ycp

    కొంతమంది కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని , నేను వైసీపీ నుండి వైదొలిగేది లేదని కుండబద్దలు కొట్టాడు నటుడు అలీ. గతకొద్ది రోజులుగా అలీ వైసీపీని వీడుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు వైసీపీ ని వీడి జనసేన పార్టీలో చేరనున్నాడని అలాగే జనసేన తరుపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తాడని పుకార్లు షికార్లు చేస్తుండటంతో ఈ వార్తలు అలీ చెవిన పడటంతో ఇక ఆ వార్తలను సహిస్తే మరింత నష్టమని భావించి ఖండించాడు.

    నేను పదవుల కోసం వైసీపీ లో చేరలేదు …… జగన్ మనసులో స్థానం కోసం మాత్రమే చేరాను. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసింది జగన్ ముఖ్యమంత్రి కావాలని. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్ కోసం ప్రచారం చేస్తానని , అంతేకాని వైసీపీ ని వీడి జనసేన లో చేరడం లేదని కుండబద్దలు కొట్టాడు అలీ.

    పవన్ కళ్యాణ్ – అలీ ఇద్దరు కూడా మంచి మిత్రులు. దాంతో జనసేన లో అలీ చేరడం ఖాయమని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా జగన్ పార్టీలో చేరడంతో పవన్ కళ్యాణ్ కు అలీ కి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ కోసం అలీ జనసేనలో చేరడం ఖాయమని మాటలు వినిపిస్తున్న ఈ తరుణంలో అలాంటిదేమి లేదని స్పష్టం చేసాడు అలీ. 

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...