41.1 C
India
Monday, May 20, 2024
More

    Jigar Tanda Double X : ”జిగర్ తండ డబుల్ ఎక్స్” మూవీ రివ్యూ అండ్ రేటింగ్..

    Date:

    Jigar Tanda Double X
    Jigar Tanda Double X

    Jigar Tanda Double X : ఏదైనా సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే మంచి అంచనాలు ఉంటాయి.. మొదటి పార్ట్ మంచి విజయం సాధిస్తే రెండవ పార్ట్ మరింత విజయం కావాలని ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకుంటారు.. మరి అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సీక్వెల్ అంటే మొదటి పార్ట్ కు మించినట్టు ఉండాలని ప్రయత్నాలు చేస్తారు.

    ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. 2014లో మంచి  విజయం సాధించిన ”జిగర్ తండా” సినిమాకు సీక్వెల్ గా ”జిగర్ తండ డబుల్ ఎక్స్” ను తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంది ఆడియెన్స్ ను ఏ రేంజ్ లో అలరించింది అనేది తెలుసుకుందాం..

    కథ :

    1975 లో ఒక థియేటర్ దగ్గర ఒక రౌడీ (లారెన్స్)కి జరిగిన గొడవ వల్ల అతడు హీరోగా మారాలి అనుకుంటాడు.. కానీ ఇతడు చూడడానికి అసహ్యంగా నల్లగా ఉంటాడు.. అలాంటి రౌడీ హీరో అవుతాను అనడంతో అక్కడ ఉన్న వారు నవ్వుతు హేళన చేస్తారు.. మరి వాళ్ళు అలా నవ్వడం చూసి ఆ రౌడీ వాళ్లందరికీ గుణపాఠం చెప్పాలి అంటే హీరో ఎలాగైనా అవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు..

    ఈ క్రమంలోనే తనను హీరోగా పెట్టి సినిమా తీసే డైరెక్టర్ కోసం వెతుకుతూ ఉండగా అదే సమయంలో అతడికి ఎస్ జె సూర్య దొరుకుతాడు. సినిమా అంటే ఇష్టం, ఫ్యాషన్ ఉండే ఎస్ జె సూర్య ఒక సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకుని పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రౌడీ తనతో సినిమా చేయమని ఇతడిని బెదిరిస్తూ ఉంటాడు.

    ముందుగా ఒప్పుకోక పోయిన ఆ తర్వాత రౌడీతో సినిమా అంటే కొత్తగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒప్పుకుంటాడు.. అప్పటి నుండి సూర్య లారెన్స్ తో సినిమా తీయడానికి ఎలాంటి పనులు చేస్తారు.. రౌడీ ఎలా మంచి వ్యక్తిగా మారుతాడు.. ఆయనతో సినిమాను తీసి రిలీజ్ చేశాడా లేదా అనేది మిగిలిన కథ..

    విశ్లేషణ :

    10 దాదాపు ఏళ్ల తర్వాత ‘జిగర్ తండా’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ను డైరెక్టర్ అద్భుతంగా డీల్ చేసాడు.. ఈ సినిమా స్టోరీ పెద్దగా లేకపోయినప్పటికీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథ నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే తో సినిమా నడిపించిన విధానం బాగుంటుంది.. లారెన్స్ కోసం రౌడీ పాత్ర డిజైన్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ లో డెప్త్ బాగా ఆకట్టుకుంది.

    నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. లారెన్స్ రౌడీ పాత్రలో అద్భుతంగా నటించాడు.. ఈ సినిమాలో లారెన్స్ కనిపించడు.. ఆ రౌడీ పాత్రలోనే లీనమైపోయేలా ఈయన నటన ఉంటుంది.. ఎస్ జె సూర్య నటన కూడా కెరీర్ లోనే బెస్ట్ గా ఉంటుంది.. నవీన్ చంద్ర కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు.

    టెక్నీకల్ పరంగా చుస్తే.. ఈ సినిమాలో స్టోరీ లేకపోయినా స్క్రీన్ ప్లే తోనే డైరెక్టర్ కథ నడిపించి వావ్ అనిపించాడు.. కార్తీక్ సుబ్బరాజు తన ఎఫర్ట్ మొత్తం పెట్టి తెరకెక్కించినట్టు అనిపించింది.. ఈ సినిమాలో మేజర్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా పండించారు. మొదటి పార్ట్ రేంజ్ లో లేకపోయినా సీక్వెల్ కూడా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు.. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సాంగ్స్ పర్వాలేదు అనిపించినా బీజీఎమ్ మాత్రం ప్లస్ పాయింట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బాగుంది.. 1975 సమయంలో తన విజువల్స్ ను చాలా బాగా క్రియేట్ చేసారు. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ప్లస్ పాయింట్స్ :
    లారెన్స్, ఎస్ జె సూర్య నటన
    కార్తీక్ సుబ్బరాజు రాసుకున్న పాయింట్స్
    విజువల్స్

    మైనస్ పాయింట్స్ :
    కథలో డెప్త్ లేకపోవడం
    సాంగ్స్
    కొన్ని సీన్స్ లాగ్

    రేటింగ్ : 2.75/5

    Share post:

    More like this
    Related

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related