33.8 C
India
Sunday, May 5, 2024
More

    Jigar Tanda Double X First Day : ”జిగర్ తండ డబుల్ ఎక్స్” ఓపెనింగ్స్.. ఫస్ట్ డే ఎంత రాబట్టిందంటే?

    Date:

    Jigar Tanda Double X first day
    Jigar Tanda Double X first day Collections

    Jigar Tanda Double X First Day Collections : ఏదైనా సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉంటాయి.. మొదటి పార్ట్ మంచి విజయం సాధిస్తే రెండవ పార్ట్ మరింత విజయం కావాలని ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకుంటారు.. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

    2014లో మంచి  విజయం సాధించిన ”జిగర్ తండా” సినిమాకు సీక్వెల్ గా ”జిగర్ తండ డబుల్ ఎక్స్” ను తెరకెక్కించారు. ఈ సినిమా నిన్న నవంబర్ 10న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. భారీ ప్రమోషన్స్ భారీ బజ్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బిజినెస్ ఎంత? మొదటి రోజు రాబట్టింది ఎంత తెలుసుకుందాం..

    దాదాపు 10 ఏళ్ల తర్వాత ‘జిగర్ తండా’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ను డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించగా రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య, టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది..

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేయగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 6 కోట్ల మేర అమ్ముడు పోయాయి. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వచ్చాయి.. మొత్తంగా 2700 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు జపాన్ సినిమా నుండి గట్టి పోటీ నెలకొనడంతో కాస్త ఓపెనింగ్స్ తగ్గాయి అనే చెప్పాలి.

    అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కోటి రూపాయలకు పైగానే వసూలు చేయగా తొలి రోజు తమిళ్ నాడులో 5 కోట్లకు పైగానే కలెక్షన్స్ నమోదు చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. 70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిగలిగితేనే లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jigar Tanda Double X : ”జిగర్ తండ డబుల్ ఎక్స్” మూవీ రివ్యూ అండ్ రేటింగ్..

    Jigar Tanda Double X : ఏదైనా సినిమాకు సీక్వెల్ వస్తుంది...