39.1 C
India
Monday, May 20, 2024
More

    Number 7 Jersey : నంబర్ 7 జెర్సీకి రిటైర్ మెంట్.. సచిన్ తర్వాత ధోనీకి అరుదైన గౌరవం!

    Date:

    Number 7 Jersey
    Number 7 Jersey of Dhoni

    Number 7 Jersey : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. మూడు ఫార్మాట్లలో ఆయన రిటైర్ మెంట్ అయిన కూడా బీసీసీఐగానీ, జనాలు గానీ ఆయన సేవలను మరిచిపోలేరు. ఇప్పటికీ మ్యాచ్ లు వీక్షిస్తున్న అభిమానులు ‘‘ధోనీ ఉంటే ఇలా చేసేవాడు.. ధోనీ ఉంటే అలా చేసేవాడు.. అరే ఈ టైమ్ లో ధోనీ ఉంటే  గెలిపించేవాడు..’’ అని అనుకుంటూనే ఉంటారు. ధోనీ అంటే అభిమానులకు అంత నమ్మకం. కూలింగ్ కెప్టెన్సీ స్కిల్స్ తో ఆయన ఆట మజాను అనుభవించని క్రికెట్ అభిమాని ఉండరు. అందుకే ఆయనంటే అంతా క్రేజ్. ధోనీ రిటైర్ మెంట్ తీసుకున్నా ఐపీఎల్ లో మాత్రం అలరిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ధోనీ సేవలపై బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నంబర్ 10 జెర్సీకి ఎంతో ప్రాముఖ్యం ఉందనేది తెలిసిందే. జెర్సీ 10 అంటేనే సచిన్ గుర్తుకొస్తారు. అంతలా అది అందరికీ గుర్తుండిపోయింది. అలాగే జెర్సీ నంబర్ 7 అన్నా ధోనీ గుర్తుకొస్తారు. సచిన్ రిటైర్ తర్వాత ఆ నంబర్ 10 జెర్సీకి కూడా  బీసీసీఐ రిటైర్ మెంట్ ప్రకటించింది. క్రికెట్ కే సచిన్ చేసిన సేవలపై, అతడికిచ్చే గౌరవంగా ఆయన ధరించిన జెర్సీనంబర్ 10ను మిగతా ఏ ఆటగాడికి కేటాయించబోమని నిర్ణయం తీసుకుంది. అంటే శాశ్వతంగా ఆ నంబర్ సచిన్ కే ఉంటుంది. అలాగే ధోనీ జెర్సీ నంబర్ 7కు కూడా తాజాగా బీసీసీఐ రిటైర్ మెంట్ ప్రకటించింది. ధోనీ భారత జట్టుకు అందించిన సేవలకు గౌరవంగా ఇలా చేసినట్టు బీసీసీఐ పేర్కొంది. సచిన్ టెండూల్కర్ తర్వాత అరుదైన గౌరవం పొందిన ఘనత ధోనీకి దక్కడం విశేషం. ఇకనుంచి జెర్సీ నంబర్ 7ను ఏ ఆటగాడు ఉపయోగించడానికి వీలుండదు.

    ధోనీ ఆటగాడిగా, కెప్టెన్ గా భారత జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అందులో ముఖ్యమైనవి కొన్ని..

    2007లో టీ-20 ప్రపంచ కప్
    2011 లో వన్డే ప్రపంచ కప్
    2013 లో చాంపియన్స్ ట్రోఫీ

    అలాగే 350వన్డే మ్యాచ్ లు ఆడి 10సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు చేశాడు. 97 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

    Share post:

    More like this
    Related

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

    Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...