40.3 C
India
Tuesday, May 21, 2024
More

    Thangalaan : ‘తంగళన్’ లో విక్రమ్ సీన్స్.. వామ్మో గూస్ బంబ్స్ గ్యారంటీ..

    Date:

    Thangalaan
    Thangalaan

    Thangalaan : మోస్ట్ టాలెంటెడ్ హీరో విక్రమ్ తర్వాతి సినిమా పా రంజిత్ దర్శకత్వంలో రాబోతోంది. ఈ మధ్య కాలంలో బాగా హైప్ పెంచుతున్న సినిమాల్లో ఈ కాంబోలో వచ్చే ‘తంగళన్’ ఒకటి. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళం, మలయాళం, తెలుగు,  కన్నడ, హిందీ భాషల్లో తంగళన్ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

    చియాన్ విక్రమ్ పుట్టినరోజు (ఏప్రిల్ 17) సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చిత్రీకరణలో చియాన్ విక్రమ్ పడే కష్టం యాడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. విక్రమ్ తన పాత్రపై ఉన్న అంకితభావాన్ని ఈ వీడియో అద్ధం పడుతుంది. షూటింగ్ లో హీరో పడే కష్టాన్ని చూపిస్తుంది. శక్తి వంతమైన, ఆకట్టుకునే వీడియో అతని పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేకతను జోడిస్తుంది.

    విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ట్రిబ్యూట్ వీడియో గురించి దర్శకుడు పా. రంజిత్ మాట్లాడారు. ‘విక్రమ్ సర్ మరియు మొత్తం టీమ్ చేసిన అద్భుతమైన కృషితో నిజమైన సంఘటనల ఆధారంగా ఒక చారిత్రక సాహస కథను అందిస్తున్నాం తంగళన్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. భారతదేశంలోని ప్రముఖ కంటెంట్ స్టూడియో అయిన జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ కేఈ జ్ఞానవేల్‌రాజాతో చేతులు నిర్మిస్తోంది. విక్రమ్ సర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రిబ్యూట్ వీడియో విక్రమ్ సర్ చేసిన ప్రయత్నాలను ప్రదర్శించడానికి, ఇది సినిమాపై దృష్టిని ఆకర్షించడానికి, మరియు భారీ అంచనాలను సృష్టించడానికి సాయ పడుతుంది.’ అని అన్నారు.

    విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్‌తో పాటు పశుపతి, హరి కృష్ణన్, డేనియల్ కాల్టాగిరోన్, ప్రీతి కరణ్ మరియు వెట్టై ముత్తుకుమార్ కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని పా. రంజిత్ నీలం ప్రొడక్షన్స్‌తో కలిసి జియో స్టూడియోస్‌పై శ్రీమతి జ్యోతి దేశ్‌పాండే మరియు స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్‌పై శ్రీ కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు.

    Share post:

    More like this
    Related

    AP Aarogyasri : ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు హాస్పిటల్స్ నిర్ణయం

    AP Aarogyasri Services : ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు...

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    Jake Fraser McGurk : ఈ భీకర ప్లేయర్ బెంచ్ కే పరిమితం.. ఆసీస్ బోర్డుపై రికీ పాంటింగ్ విమర్శలు

    Jake Fraser McGurk : జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఢిల్లీ...

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Thangalaan Movie Teaser : ”తంగలాన్” టీజర్ చూసారా.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం..

    Thangalaan Movie Teaser : ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం...

    చియాన్ విక్రమ్,,, చించిపడేస్తున్నాడు..!

    ఇండియన్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెద్దన్న ఎవరు అంటే.. ఎవరైనా ముందుగా చెప్పే...