30.1 C
India
Sunday, April 19, 2026
More

    చియాన్ విక్రమ్,,, చించిపడేస్తున్నాడు..!

    Date:

    Chiyan Vikram is tearing up..!
    Chiyan Vikram is tearing up..!

    ఇండియన్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెద్దన్న ఎవరు అంటే.. ఎవరైనా ముందుగా చెప్పే పేరు వెర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ నే. ఆయన చేసినన్ని ప్రయోగాలు బహుశా మరేహీరో చేయలేదంటే అతిశయోక్తిలేదు. ఇక ఆయన తర్వాత అంతటి విలక్షణ నటుడు ఎవరంటే చెప్పే పేరు కోలీవుడ్ కు చెందిన చియాన్ విక్రమ్ నే . అపరిచితుడు, మల్లన్న, ఐ,
    ఇంకొక్కడు, కోబ్రా లాంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులనేకాదు.. సినీ విమర్శకులను మెప్పించింది. శివపుత్రుడు ఐ మూవీలను మించి పెద్ద ప్రయోగం చేయడం ఆసక్తికరంగా మారింది.

    పొన్నియిన్ తర్వాత విక్రమ్ చేస్తున్న మూవీ తంగలాన్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ కోసం విక్రమ్ పెడుతోన్న ఎఫర్ట్ టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది. మాములుగానే తన సినిమాల్లో స్టోరీకి తగ్గట్లు గెటప్స్ వేస్తూ వచ్చే విక్రమ్… తంగలాన్ కోసం అయిన ట్రాన్స్ఫర్మేషన్ నుంచి గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఈ మూవీ కోసం విక్రమ్‌ టోటల్ గా తన బాడీమేకోవర్ ను మార్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. స్టైలిష్‌కు బ్రాండ్‌లా కనిపించే విక్రమ్‌ ఈ సినిమాలో డీ గ్లామరైజ్‌ లుక్ కనిపించి ఔరా అనిపించాడు. రీసెంట్ గా చియాన్ బర్త్ డే సందర్భంగా రిలీజైన మేకింగ్ వీడియోలో తన నట విశ్వరూపం చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. పైగా ఒక్క యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రజెంట్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక చేస్తోంది.

    తాను చేసే ప్రతి సినిమాలోనూ ఓ డిఫెరెంట్ లుక్ లో కనిపించే విక్రమ్.. తంగలాన్ లోను షాకింగ్ లుక్ లో అదరగొట్టేయబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అంచనాలు పెంచాడు విక్రమ్. ఫుల్ గా గడ్డం పెంచి… ఒంటి మీద కేవలం గోచి మాత్రమే ఉంచుకొని పల్లెటూరి వ్యక్తిలా కనిపించాడు. ఆయన మాస్ అవతారం చూస్తుంటే… గతంలో ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది. 1800 కాలం నాటి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌లో.. కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రీడీలో ఫార్మెట్ లో వస్తున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్ దళితవాదం వినిపించనున్నారని తెలుస్తోంది. మొత్తానికి విక్రమ్ ఈ మూవీతో కచ్చితంగా సరికొత్త రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్ . చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vikram : అపరిచితుడు రీమేక్ పై విక్రమ్ సంచలన ప్రకటన.. తనను తీసుకోకపోవడంపై కారణాలపై..

    Vikram : శంకర్‌-విక్రమ్‌ కాంబోలో 2005లో వచ్చిన భారీ చిత్రం ‘అపరిచితుడు’...

    Hero Vikram : ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ఎవరో తెలుసా.. హీరో విక్రమ్ కామెంట్స్ 

    Hero Vikram Comments : ప్రభాస్ అంటే తెలుగులో హీరో మాత్రమే కాదని...

    Rajamouli : రాజమౌళితో సినిమాకు విక్రమ్ ఓకే చెప్పేశారా.. ఆయన ఏం అన్నారంటే..

    Rajamouli : విలక్షణ నటుడు విక్రమ్ నటించిన సినిమా 'తంగలాన్' ఈ నెల...

    Sukumar – Lokesh Kanakaraj : సుకుమార్ ఫోకస్ దానిపైనే.. మరి లోకేశ్ కనకరాజ్ పరిస్థితేంటి…

    Sukumar - Lokesh Kanakaraj : తెలుగులో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో...