Thangalaan : మోస్ట్ టాలెంటెడ్ హీరో విక్రమ్ తర్వాతి సినిమా పా రంజిత్ దర్శకత్వంలో రాబోతోంది. ఈ మధ్య కాలంలో బాగా హైప్ పెంచుతున్న సినిమాల్లో ఈ కాంబోలో వచ్చే ‘తంగళన్’ ఒకటి. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తంగళన్ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
చియాన్ విక్రమ్ పుట్టినరోజు (ఏప్రిల్ 17) సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చిత్రీకరణలో చియాన్ విక్రమ్ పడే కష్టం యాడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. విక్రమ్ తన పాత్రపై ఉన్న అంకితభావాన్ని ఈ వీడియో అద్ధం పడుతుంది. షూటింగ్ లో హీరో పడే కష్టాన్ని చూపిస్తుంది. శక్తి వంతమైన, ఆకట్టుకునే వీడియో అతని పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేకతను జోడిస్తుంది.
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ట్రిబ్యూట్ వీడియో గురించి దర్శకుడు పా. రంజిత్ మాట్లాడారు. ‘విక్రమ్ సర్ మరియు మొత్తం టీమ్ చేసిన అద్భుతమైన కృషితో నిజమైన సంఘటనల ఆధారంగా ఒక చారిత్రక సాహస కథను అందిస్తున్నాం తంగళన్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. భారతదేశంలోని ప్రముఖ కంటెంట్ స్టూడియో అయిన జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ కేఈ జ్ఞానవేల్‌రాజాతో చేతులు నిర్మిస్తోంది. విక్రమ్ సర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రిబ్యూట్ వీడియో విక్రమ్ సర్ చేసిన ప్రయత్నాలను ప్రదర్శించడానికి, ఇది సినిమాపై దృష్టిని ఆకర్షించడానికి, మరియు భారీ అంచనాలను సృష్టించడానికి సాయ పడుతుంది.’ అని అన్నారు.
విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్‌తో పాటు పశుపతి, హరి కృష్ణన్, డేనియల్ కాల్టాగిరోన్, ప్రీతి కరణ్ మరియు వెట్టై ముత్తుకుమార్ కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని పా. రంజిత్ నీలం ప్రొడక్షన్స్‌తో కలిసి జియో స్టూడియోస్‌పై శ్రీమతి జ్యోతి దేశ్‌పాండే మరియు స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్‌పై శ్రీ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.