30.9 C
India
Friday, May 17, 2024
More

    MI VS LSG : ముంబయి ఇండియన్స్.. లక్నో సూపర్ గెయింట్స్ మధ్య కీలక పోరు

    Date:

    MI VS LSG
    MI VS LSG

    MI VS LSG : ముంబయి ఇండియన్స్ టీం ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచులు ఆడి కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండగా.. ప్లే ఆప్స్ చేరాలంటే మిణుకు మిణుకు మనే ఆశలు ఉన్నాయి. రాబోయే అన్ని మ్యాచులు గెలవాలి. మంచి నెట్ రన్ రేట్ ఉండాలి. ఈ సమయంలో లక్నో తో మంగళవారం సాయంత్రం జరగబోయే మ్యాచ్ ముంబయికి కీలకం కానుంది.

    ఈ మ్యాచులో గనక ముంబయి ఓడిపోతే దాదాపు ప్లే ఆప్ బెర్త్ కోల్పోయినట్లే. కాబట్టి ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి గెలవాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. సూర్య కూడా రాణించడం లేదు. బౌలింగ్ లో బుమ్రా మినహా ఎవ్వరూ సరిగా బౌలింగ్ చేయడం లేదు. దీంతో భారమంతా బుమ్రా మీదనే పడుతోంది.

    లక్నో సూపర్ గెయింట్స్ ప్రస్తుతం తొమ్మిది మ్యాచులు ఆడి అయిదింట్లో విజయం సాధించింది. కే ఎల్ రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మార్కస్ స్టోనియిస్ గత మ్యాచ్ లో డకౌట్ కాగా.. అంతకుముందు మ్యాచులో సెంచరీతో కదం తొక్కాడు. బౌలింగ్ కాస్త వీక్ గా కనిపిస్తోంది. ఇండియన్ బౌలింగ్ లైనప్ తో నెగ్గుకువస్తున్నారు. ముఖ్యంగా యాసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ దారాళంగా పరుగులు ఇస్తున్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ రాణించాలని కోరుకుంటున్నారు.

    లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా.. ఈ పిచ్ కాస్త స్లో గా ఉంటుంది. ఇక్కడ వరుసగా లక్నో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. కాబట్టి ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో జాగ్రత్తగా ఆడి ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లక్నో ఈ మ్యాచ్ గెలిస్తే మూడో స్థానానికి వెళుతుంది. పాయింట్స్ టేబుల్స్ లో మళ్లీ సన్ రైజర్స్ కిందకు పడిపోతుంది. ఈ కీలక మ్యాచులో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...