39.8 C
India
Friday, May 3, 2024
More

    Surya : గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘కంగువ’ గ్లింప్స్.. నెక్స్ట్ లెవల్లో సూర్య పర్ఫార్మెన్స్..

    Date:

    kanguva movie
    kanguva movie

    Surya  సూర్య.. ఈయన పేరు చెబితే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. ఈయన ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకు పోతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇక ఈయన జై భీం, విక్రమ్ తో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు..

    విక్రమ్ లో క్యామియో రోల్ లో 5 నిముషాలే కనిపించిన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఇక ఇప్పుడు ఈయన భారీ పీరియాడికల్ సినిమాను ప్రకటించి దానిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ రోజు ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”కంగువ” నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్..

    ఇప్పటికే సూర్య నటిస్తున్న కంగువ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి కొద్దిసేపటి క్రితం గ్లింప్స్ రిలీజ్ చేయడా సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.. ఈ సినిమా అర్ధరాత్రి 12 గంటల 1 నిముషానికి సూర్య పుట్టిన రోజు రాగానే రిలీజ్ చేయడం విశేషం..

    మరి ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. విజువల్ వండర్ గా యాక్షన్ సన్నివేశాలతో సూర్య ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు.. ఇక సూర్య ఆదివాసీ వీరుడుగా కనిపించాడు.. ఆయన రాక్షసత్వం చూపించిన తీరుకు వెన్నులో భయం పుట్టేలా ఉంది.. మొత్తానికి ఈసారి పాన్ ఇండియా వ్యాప్తంగా సూర్య కంగువ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకునేలా ఉన్నాడు.

    ఇక ఇందులో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా స్టూడియో గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్, యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. మొత్తం 10 భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Surya & Karthik’s Childhood Photos : ఈ ఫోటోలోని అబ్బాయిలు.. ఇప్పుడు పాపులర్ హీరోలు.. మీరు గుర్తుపట్టారా?

    Surya & Karthik's Childhood Photos : ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో...

    Vishal : త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విశాల్.. వధువు ఆ హీరోయినే అని తెలుసా?

    Vishal : కోలీవుడ్ స్టార్ హీరోల్లో విశాల్ ఒకరు.. ఈయన తెలుగు...

    త‌మిళ స్టార్ విక్ర‌మ్‌కు విరిగిన ప‌క్క‌టెముక‌లు.. అభిమానుల్లో ఆందోళ‌న‌..!

    ద‌క్షిణాదిలో విల‌క్ష‌ణ సినిమాలు తీసే త‌మిళ స్టార్ విక్ర‌మ్‌కు ప్ర‌మాదం జ‌రిగింది....

    చియాన్ విక్రమ్,,, చించిపడేస్తున్నాడు..!

    ఇండియన్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెద్దన్న ఎవరు అంటే.. ఎవరైనా ముందుగా చెప్పే...