31 C
India
Thursday, May 16, 2024
More

    Surya & Karthik’s Childhood Photos : ఈ ఫోటోలోని అబ్బాయిలు.. ఇప్పుడు పాపులర్ హీరోలు.. మీరు గుర్తుపట్టారా?

    Date:

    Surya & Karthik’s Childhood Photos :

    ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా పలువురు స్టార్ హీరోహీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫొటోస్ సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతూ అభిమానుల మేధస్సుకు పదును పెడుతూ ఉంటాయి.

    టాలీవుడ్.. బాలీవుడ్.. కోలివుడ్ అనే తేడా లేకుండా నటీనటుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఒక ట్రెండ్ గా మారింది. తాజాగా ఓ ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు కూడా అన్నదమ్ములు కాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనూ వీరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం.

    ఈ ఫోటో చూసిన అభిమానుల్లో కొందరు ఇప్పటికే ఈ అబ్బాయిలను కనిపెట్టి ఉండవచ్చు. ఇక అసలు విషయంలోకి వస్తే.. వీరెవరు కాదు సూర్య అండ్ కార్తీ. విలక్షణమైన నటనతో సూర్య.. కార్తీలు కోలివుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే వీరి సినిమాలు తెలుగులోనూ డబ్ అయి సూపర్ హిట్స్ గా నిలిచాయి.

    దీంతో వీరికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సూర్య తెలుగులో ‘గజని’..‘సింహం’.. ‘జై భీం’ వంటి సినిమాలతో మనవాళ్లకు దగ్గరయ్యాడు. జాతీయ స్థాయిలోనూ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించాడు. అలాగే కార్తీ ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ‘శకుని’.. ‘దొంగ’.. ‘చెలియా’.. ‘ఊపిరి’.. ‘ఖైదీ’..‘సర్దార్’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బీజీబీజీగా గడుపుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Surya : గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘కంగువ’ గ్లింప్స్.. నెక్స్ట్ లెవల్లో సూర్య పర్ఫార్మెన్స్..

    Surya  సూర్య.. ఈయన పేరు చెబితే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.....

    సూర్య 42 పై మగధీర,బాహుబలి ఎఫెక్ట్..!

    కొత్త తరహా కథలు, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చే సూర్య.. ప్రస్తుతం...

    క్రికెట్ దేవుణ్ణి కలిసిన హీరో సూర్య

    భారతదేశంలో క్రికెట్ దేవుడు అంటే టక్కున చెప్పే పేరు సచిన్ టెండూల్కర్....