36.9 C
India
Tuesday, April 21, 2026
More

    సూర్య 42 పై మగధీర,బాహుబలి ఎఫెక్ట్..!

    Date:

    Magadheera, Baahubali effect on Surya 42
    Magadheera, Baahubali effect on Surya 42

    కొత్త తరహా కథలు, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చే సూర్య.. ప్రస్తుతం పీరియాడిక్ ప్రాజెక్ట్‌ లో నటిస్తున్నాడు. సూర్య 42 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారుతోంది. ‘శౌర్యం’ శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో త్రీడీలో రూపొందిస్తున్నాడు. ఈ నెల 16న ఉదయం 9.05 నిముషాలకు టైటిల్‌‌ను రివీల్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌ అలా రిలీజ్ కాగానే ఇండస్ట్రీలో కొత్త చర్చ ఊపందుకుంది.

    యోధుడు ఉరుములు, మెరుపుల మధ్య కదనరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.. అంటూ లాంఛ్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఆయుధాలతో గుర్రంపై స్వారీ చేస్తూ.. ఒక కొండ చివరి నుండి మరో కొండ పైకి జంప్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. జస్ట్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగితే… మరోవైపు మగధీరలా, బహుబలి లు ఛాయలు గుర్తు కొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా పూర్వజన్మల నేపథ్యంలో…వార్ బ్యాక్ డ్రాప్ తో సినిమా ఉండబోతున్నట్లు తెలియడంతో మగధీర, బాహుబలి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.

    ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.10 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడమే కాక సాలిడ్ ప్లానింగ్స్ తో ప్రమోషన్స్ షురూ చేయాలనుకుంటున్నారట. సినిమా రిలీజ్ కానున్న ప్రతి భాషలో కూడా ఆ ఇండస్ట్రీకి చెందిన బిగ్ స్టార్స్ తో సూర్య 42 కి ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇటు తమిళ్ లో అయితే ఊహించని పర్సనాలిటీస్ సూర్య 42 కోసం వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ సినిమా కోసం గట్టి ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరీ మగధీర, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమట!

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానం....

    Hero Surya : జూనియర్ ఎన్టీఆర్ కోసం వందల కోట్ల రూపాయిలను త్యాగం చేసిన హీరో సూర్య!

    Hero Surya : జూనియర్ ఎన్టీఆర్ మన తెలుగు హీరో..సూర్య తమిళ...

    Jawan & Kattappa : ‘కట్టప్ప’కు ‘జవాన్’కి ఉన్న లింకేంటి.. అట్లీ మామూలోడు కాదు..!

    Jawan & Kattappa : షారుఖ్ సెన్సేషనల్ మూవీ ‘జవాన్’ మూవీతో ‘బాహుబలి’...