33.1 C
India
Sunday, April 28, 2024
More

    Hero Surya : జూనియర్ ఎన్టీఆర్ కోసం వందల కోట్ల రూపాయిలను త్యాగం చేసిన హీరో సూర్య!

    Date:

    Hero Surya
    Hero Surya and Jr NTR

    Hero Surya : జూనియర్ ఎన్టీఆర్ మన తెలుగు హీరో..సూర్య తమిళ హీరో..వీళ్లిద్దరు బయట సరదాగా కలుసుకున్న దాఖలాలు కూడా లేవు. అలా తనకి ఏమాత్రం పరిచయం లేని ఎన్టీఆర్ కోసం సూర్య వందల కోట్లు త్యాగం చెయ్యడం ఏమిటి?, అంత అవసరం ఏమొచ్చింది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు.అసలు పాయింట్ కి వస్తున్నాం..#RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్నాడు.

    ఈ సినిమా షూటింగ్ గత కొంతకాలంగా విరామం లేకుండా సాగుతుంది. దాదాపుగా ప్రధాన భాగం టాకీ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 4 వ తేదీన మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కి , అలాగే రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ నుండి సరైన సినిమా కోసం ఇన్ని రోజులు వేచి చూడడం న్యాయమే అని ఈ గ్లిమ్స్ వీడియో చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల అయ్యే రోజునే సూర్య ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ ని కూడా విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమిళ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపుగా 250 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారట. గత ఏడాది విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని అప్పటికే దేవర చిత్రం ఆక్రమించింది అనే విషయాన్నీ తెలుసుకున్న సూర్య, ఆ తేదీన కాకుండా, మరో తేదీలో విడుదల చేయాల్సిందిగా తన మేకర్స్ ని కోరాడట.

    ఎందుకంటే రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలు. ఒకే రోజు విడుదల అవ్వడం వల్ల రెండు సినిమాలకు పెద్ద నష్టమే, ఎన్టీఆర్ కి తమిళ మార్కెట్ కావాలి, అలాగే సూర్య కి తెలుగు ఆడియన్స్ ఇచ్చే వసూళ్లు కావాలి. దేవర విడుదల రోజు ‘కంగువ’ వస్తే కనీస స్థాయి థియేటర్స్ కూడా దక్కవు. దేవర కి కూడా తమిళనాడు లో ఇదే పరిస్థితి. అందుకే సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కానీ ఏప్రిల్ 4 ఒక పెద్ద సినిమా విడుదలకు ఎంతో మంచి తేదీ అని చెప్పొచ్చు. ఈ తేదీన వస్తే టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉండేది. ఆ అవకాశం ని సూర్య వదిలేసుకున్నాడు అని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...