29.8 C
India
Thursday, May 16, 2024
More

    Jawan & Kattappa : ‘కట్టప్ప’కు ‘జవాన్’కి ఉన్న లింకేంటి.. అట్లీ మామూలోడు కాదు..!

    Date:

    Jawan & Kattappa :

    షారుఖ్ సెన్సేషనల్ మూవీ ‘జవాన్’ మూవీతో ‘బాహుబలి’ కట్టప్పకు ఓ లింకు ఉంది. దర్శకుడు అట్లీ తన సినిమాలను గతంలో చాలా పాపులర్ అయిన పాత సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని మలుస్తూ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన పలు సినిమాలు ఈ కోవకు చెందినవే. షారుఖ్ ‘జవాన్’ సైతం సత్యరాజ్(కట్టప్ప) హీరోగా నటించిన ‘తాయ్’ కథాంశంతో చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.

    ‘బాహుబలి’ కట్టప్ప ఇప్పటి జనరేషన్ కు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తెలుసు. కానీ 1980 నుంచి 2000 వరకు ఆయన కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగారు. ‘బహ్మ’.. ఎం.ధర్మరాజు ఎంఏ.. ఎస్పీ పరశురామ్ ఒరిజినల్ మూవీల్లో సత్యరాజే కథానాయకుడు. ఆయన నటించిన ‘తాయ్’ 1989లో రిలీజై నాడు సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రాధిక హీరోయిన్.

    ఈ సినిమా స్టోరీని పరిశీలిస్తే.. నిజాయితీ కలిగిన ఒక మిలిటరీ ఆఫీసర్ ని దుండగులు అన్యాయంగా కేసులో ఇరికిస్తారు. శత్రువులకు సహకారం అందించాడనే నెపంతో అవమానాలు చేస్తారు. నిజం బయటకు రాకుండా అతనిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు. అతడి కుటుంబం అవమానం భారంమోస్తుంది. ఇక అతడి కొడుకు పెరిగి పెద్దవాడై తండ్రిని ఈ స్థితికి తీసుకు వచ్చిన వాళ్లను పట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటాడు.

    ఈ రెండు పాత్రల్లో సత్యరాజ్ డ్యూయల్ రోల్ చేశారు. ఇదే కథను అట్లీ ‘జవాన్’లో చూపించారు. అయితే ‘జవాన్’లో తండ్రిని బ్రతికించి అతడి స్థానంలో దీపికా పదుకొనేకి ఉరి వేయిస్తాడు. ఇదొక్కడే ప్రధానమైన తేడా. ఈ ఒక్క సినిమానే కాకుండా అట్లీ గతంలో తీసిన సినిమాల్లోనూ పాత సినిమాలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని తన ప్రాజెక్టులో భాగంగా చేస్తూ హిట్ కొడుతున్నాడు. ఈ ఫార్మూలా అతనికి బాగా కలిసి రావడంతో రాబోయే చిత్రాల్లోనూ అట్లీ ఇదే ఫార్ములా కొనసాగించే అవకాశం కన్పిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jawan Box Office Collections : జవాన్ సంచలన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆర్ఆర్ఆర్ చేరువలో.. ఎంత రాబట్టిందంటే?

    Jawan Box Office Collections : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్...

    Jawan Day 4 Collections : బాక్సాఫీస్ వద్ద జవాన్ కలెక్షన్ల సునామీ.. వామ్మో.. 4 రోజుల్లోనే 500 కోట్లు!

    Jawan Day 4 Collections : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్...

    Shahrukh’s ‘Dunki’ : షారుఖ్ నెక్స్ట్ టార్గెట్ ‘డంకీ’.. స్టోరీ లైనప్ ఏంటీ?

    Shahrukh's 'Dunki' : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్...