Jawan Box Office Collections :
పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు అంతకంటే బిగ్గెస్ట్ హిట్ తో మరోసారి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు.. ఈయన ఫ్యాన్స్ జవాన్ సినిమాతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.. మరి జవాన్ రెండు వారాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం..
300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొదటి షో నుండి పాజిటివ్ బజ్ తో దూసుకు పోతు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్ లోనే 500 కోట్లను వరల్డ్ వైడ్ గా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్ లో 368. 38 కోట్ల నెట్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక నిన్న 14వ రోజు కూడా 9 కోట్ల నెట్, 15 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే జవాన్ మ్యానియా గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా అక్కడ 39.4 మిలియన్ డాలర్స్ అంటే ఇండియా కరెన్సీలో 325 కోట్ల వరకు రాబట్టింది. నార్త్ అమెరికాలో 10 మిలియన్ డాలర్స్ రాబట్టింది.
ఆర్ఆర్ఆర్ నార్త్ అమెరికాలో 14.33 డాలర్స్ రాబట్టగా ఈ రికార్డుకు చేరువలో జవాన్ ఉంది. మరో వారానికి ఈ రికార్డ్ ను క్రాస్ చేసిన ఆశ్చర్యం లేదు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు 518 కోట్ల నెట్ కలెక్షన్స్, 922 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. దీంతో ఇప్పటికే ఈ సినిమా 218 కోట్ల లాభాలను అందుకుని నిర్మాతల జేబులను నింపుతుంది.
ReplyForward
|