30.8 C
India
Friday, May 17, 2024
More

    Shahrukh’s ‘Dunki’ : షారుఖ్ నెక్స్ట్ టార్గెట్ ‘డంకీ’.. స్టోరీ లైనప్ ఏంటీ?

    Date:

    Shahrukh’s ‘Dunki’ :

    బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ నుంచి ‘పఠాన్’ మూవీ వచ్చింది. ఈ సినిమాకు నార్త్.. సౌత్ అనే తేడా లేకుండా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా కలెక్షన్లు ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ సినిమా విడుదలైన ఏడు నెలలకే షారుఖ్ నుంచి ‘జవాన్’ సినిమా వచ్చింది.

    తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో స్టార్ నటీనటులంతా దక్షిణాది వారు కావడంతో ఈ సినిమా కూడా నార్త్.. సౌత్ అనే తేడా లేకుండా కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. షారుఖ్ ‘పఠాన్’ కలెక్షన్లను ‘జవాన్’ మూవీ బీట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    షారుఖ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాక తన తదుపరి మూవీని డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. సామాజిక అంశాలను ఇతివృత్తం చేసుకుని మనసుకు హత్తుకునేలా తీసే ప్రముఖ దర్శకుడు రాజకుమార్ హిరాణీతో షారుఖ్ తన తదుపరి మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘డంకీ’ అని తెలుస్తోంది.

    కాగా రాజకుమార్ హిరాణీ గతంలో చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. మున్నాభాయ్ ఎంబీబీఎస్.. లగే రహో మున్నాభాయ్.. పీకే.. సంజు.. 3 ఇడియట్స్ సినిమాలన్నీ కూడా దేనికదే సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో షారుఖ్ తో రాజకుమార్ హిరాణీ తెరకెక్కించే ‘డంకీ’ కూడా సూపర్ హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో షారుఖ్ హట్రిక్ కొడతాడా? లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jawan Box Office Collections : జవాన్ సంచలన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆర్ఆర్ఆర్ చేరువలో.. ఎంత రాబట్టిందంటే?

    Jawan Box Office Collections : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్...

    Jawan Day 4 Collections : బాక్సాఫీస్ వద్ద జవాన్ కలెక్షన్ల సునామీ.. వామ్మో.. 4 రోజుల్లోనే 500 కోట్లు!

    Jawan Day 4 Collections : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్...

    Jawan & Kattappa : ‘కట్టప్ప’కు ‘జవాన్’కి ఉన్న లింకేంటి.. అట్లీ మామూలోడు కాదు..!

    Jawan & Kattappa : షారుఖ్ సెన్సేషనల్ మూవీ ‘జవాన్’ మూవీతో ‘బాహుబలి’...

    Jawan 2 Days Collections : జవాన్ సంచలనం.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు రాబట్టిన షారుఖ్.. ఇది నిజంగా రికార్డే!

    Jawan 2 Days Collections : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్...