36.8 C
India
Tuesday, May 21, 2024
More

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Date:

    Sukumar and Ram Charan
    Sukumar and Ram Charan

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980 బ్యాక్ గ్రౌండ్ తో సుకుమార్ రంగస్థలం మూవీ తీసి బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టాడు. అందులో రామ్ చరణ్ చెవిటి వాడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా తీయలేకపోయారు. సుకుమార్ పుష్ప సినిమాతో నేషనల్ లో ఫేమస్ అయ్యాడు. పుష్ప లో అల్లు అర్జున్ నటనకు ఫిల్మ్ ఫేర్ జాతీయ అవార్డు అందుకున్నాడు.

    రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ  చేస్తున్నాడు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తీస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ వినయ విధేయ రామ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ చేశాడు. రాజమౌళి సినిమా అనగానే మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. కాబట్టి ఆ మధ్యలో రామ్ చరణ్ కనిపించలేదు. దీంతో గ్యాప్ ఎక్కువగా వచ్చింది.

    ఈసారి నుంచి గ్యాప్ ఎక్కువ తీసుకోకూడదనే రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు. వరుసగా సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మళ్లీ సినిమా రానుండడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సారి కూడా బొమ్మ అదుర్స్ అనుకుంటున్నారు. ఇందులో కథ రజాకార్ కాలం నాటిదని తెలుస్తోంది. మరీ దీని నేపథ్యం ఎలా ఉండబోతుంది. రామ్ చరణ్ కు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారనే విషయాలు తెలియాల్సి ఉంది.

    రామ్ చరణ్ ప్రస్తుతం పూర్తిగా గేమ్ చేంజర్ మూవీ తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఒక దాని వెనక ఒక మూవీ చేయనున్నాడు. ఈ సారి గ్యాప్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. గ్యాప్ వల్ల ప్రేక్షకులకు దూరం అవుతానని అనుకుంటున్నాడు. ఆగస్టు 15 న పుష్ఫ 2 విడుదల కానుండగా ఆ తర్వాత సుకుమార్, రామ్ చరణ్ సినిమా పట్టాలకెక్కనుంది.  గేమ్ చేంజర్ సినిమా  కోసం దిల్ రాజు కూడా భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు గేమ్ చేంజర్ కోసమే రూ. 300 కోట్లు ఖర్చు చేస్తుండగా అంచనాలు పెరిగిపోయాయి.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...