41.1 C
India
Monday, May 20, 2024
More

    Vizag Steel Plant : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. ఈసారి విశాఖ స్టీల్ ప్లాంటుపై..

    Date:

    Vizag Steel Plant :

    ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఏపీలో వైసీపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తున్నదనే ఊహాగానాలు బలపర్చేలా కదలికలు ఉంటున్నాయి. ఇటీవలే ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసిన కేంద్రం,తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక వైసీపీకి మేలు చేసే అంశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీకి ఆర్థికంగా నిధుల సమీకరణకు కూడాకేంద్రం ఇటీవల సహకరిస్తున్నది.

    అయితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.  విశాఖను ఇప్పటికే నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీ జాబితాలో చేర్చారు. కొంతకాలంగా రాజకీయంగా వివాదంగా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా తెరపైకి వచ్చింది. దీనిని విరమించుకోవాలని ఏపీ సీఎం జగన్ కూడాకేంద్రానికి లేఖ రాశారు. ఇక ప్రైవేటీకరణ నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ క్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం పునరాలోచనలో ఉందని, యథాతథ స్థితిని కొనసాగించేలా కేంద్రం నుంచి సంకేతాలు అందుతున్నాయని మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం దాదాపు నిలిచిపోయినట్లేనని, ఇక సంస్థను లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  విశాఖ ఉక్కు పరిశ్రమ కేవలం 30 వేల మంది కార్మికులదేకాదని, ప్రజలందరిది అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో యాజామాన్యం నిర్వాకం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని జీవీఎల్ ఆరోపించారు. ఇక స్టీల్ ప్లాంట్ పై కేంద్రం పునరాలోచనలో ఉందనే వార్త కార్మికులకు పెద్ద ఊరటగా మారింది.

    Share post:

    More like this
    Related

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఏపీలో అడుగుపెట్టనున్న కేసీఆర్ : ఈనెలలోనే వైజాగ్ లో సభ

    భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...