
Wild Animals : ఏనుగులు సాధు జంతువులు. ఉత్సవాలు, వేడుకలు, ఆలయాల వద్ద కనిపిస్తూ ఉంటాయి. వాటికి పండ్లు పెట్టినా, ఫలహారాలు ఇచ్చినా తీసుకుంటూ దీవిస్తుంటాయి. అదే అడవి ఏనుగు అయితే ఇవి చాలా క్రూరంగా ఉంటాయి. వాటికి ఆకలైందా పంటలను ధ్వంసం చేస్తాయి. ఇళ్ల మీద పడి వీరంగం చేస్తాయి. అటవీ సమీపంలోని గ్రామాల్లోకి వచ్చి భయపెడతాయి. ఇదంత అటుంచితే ఒక వ్యక్తి చేసిన పనికి ఏనుగు ఏం చేసిందో తెలుసా..
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి శివారులోని అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు రోడ్డు దాటేందుకు యత్నిస్తుంది. ఏనుగు పోయేంత వరకూ వెహికిల్స్ ను ఆపారు. అయితే ఒక వ్యక్తి ఏనుగు దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాడు. ఏనుగుకు మొక్కడం, ప్రణవిల్లడం చేశాడు. దీంతో ఏనుగు భయపడి వెనుకడుగు వేసింది. ఏనుగు రోడ్డుపైకి రాకుండా రక్షణగా నిలబడ్డట్ల ఉంటూ వాహనాలను వెళ్లిపోమంటూ సైగ చేశాడు. ఆయన అలా చేస్తుంగా ఏనుగు ఆయనపైకి దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ ఆగిపోయింది. అక్కడి వారు ఎంత చెప్పినా ఆయన వినలేదు.
అయితే ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్విసెస్ ఆఫీసర్ బదోలా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘అలా చేయడం చాలా ప్రమాదకరం.. ఆ ఏనుగు చాలా మర్యాదగా ప్రవర్తించి సదరు వ్యక్తిని వదిలేసింది’ అని రాసుకున్నాడు. అయితే సదరు వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘జంతువుల జోలికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు’ అంటూ హెచ్చరిస్తున్నారు. ‘జంతువులను వాటి స్వేచ్ఛను గౌరదించాలి’ అంటూ పోస్ట్ పెట్టారు.
It was suicidal, even then the gentle giant tolerated the man and let him go.
Via: @Saket_Badola pic.twitter.com/27F6QHstkn
— Ramesh Pandey (@rameshpandeyifs) May 11, 2023