
Naresh Pavitra Lokesh : నరేష్ చాలా బోల్డ్ అని ఈ మధ్య నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఈయన చేస్తున్న చర్యలు చూస్తుంటే నెటిజెన్స్ కు ఇదే అభిప్రాయం కలుగక మానదు.. ఇంతకు ముందు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి ఇప్పుడు నరేష్ పేరు చెబితే చాలు ఈయన రొమాంటిక్ యాంగిల్ మాత్రమే ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యింది.
నరేష్ తెలుగు ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకు పోతున్నాడు.. కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన నరేష్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యాడు.
మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు కూడా విడాకులు ఇచ్చిన ఈయన ఇప్పుడు నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు.. గత ఐదేళ్లుగా వీరు కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది.. త్వరలోనే ఈ జంట మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. నరేష్ – పవిత్ర జంటగా నటించిన ఈ సినిమాలో ఆయన లైఫ్ లో చోటు చేసుకున్న యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్టు సమాచారం..
ఈ సినిమా మే 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ జంట ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్త్ సెన్స్ ప్రోగ్రాంకు గెస్టులుగా వచ్చారు.. మరి ఇక్కడ కూడా ఈ కపుల్ రొమాన్స్ తో చంపేశారు.. ఇందులో ఓంకార్ మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని అడుగగా.. ఆకాశం మీద పడ్డా.. భూమి బద్దలైన మేము కలిసే ఉంటామని చెప్పుకొచ్చారు. అలాగే ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేసారు.. ఇది చూసిన నెటిజెన్స్ మాకు ఈ ఖర్మ ఏంటిరా అయ్యా అంటూ కామెంట్స్ చేసున్నారు.