37.2 C
India
Monday, May 20, 2024
More

    Tirumala Updates: తిరుమలలో తగ్గిన రద్దీ.. కారణమిదేనా..?

    Date:

     

    Tirupati
    Tirupati

    Tirumala Updates:

    తిరమలకు వచ్చే భక్తుల రద్దీ ఇటీవల తగ్గింది. అయితే ఇటీవల నడక దారిలో చిరుత పులులు, ఎలుగు బంట్ల సంచారం నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గడానికి కారణంగా కనిపిస్తున్నది. అయితే ఈసారి ఆదివారం కూడా భక్తుల రద్దీ కొంత తక్కువగానే కనిపించింది. గత ఆదివారం 79444 మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. సోమ, మంగళ, బుధ వారాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. భక్తుల రాక కొంత తగ్గింది.

    అయితే ఆదివారం శ్రీవారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.21 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆదివారం 28744 మంది మాత్రమే తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. అయితే సీజన్ కాకున్నా గతంలో కంటే భక్తుల రద్దీ తగ్గినట్లుగా తెలుస్తున్నది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో బాలికపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. ఇక వన్యమృగాల సంచారం కూడా తిరుమలలో పెరిగింది. ఈనేపథ్యంలో టీటీడీ రంగంలోకి దిగినా, భక్తుల్లో కొంత భయాందోళనలు నెలకొన్నాయి. మెట్ల మార్గంలో కాలి నడకన వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలా మంది తమ వాహనాల్లోనే చేరుకుంటున్నారు. ఆర్టీసీని ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గాన వచ్చే వారికి కూడా దివ్యదర్శనం టోకెన్లు అందిస్తున్నట్లు టోకెన్లు ప్రకటించింది.

    మరోవైపు మెట్ల మార్గంలో భద్రతను టీటీడీ పెంచింది. భక్తులకు కూడా కర్రలు అందజేస్తున్నారు. మరికొందరు సిబ్బందిని ఆయా చోట్ల అందుబాటులో ఉంచింది. అవసరమైన చోట కంచె నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని చెబుతున్నది. బాలిక మృతి ఘటన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే చిరుతలను బంధించి, ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. భక్తుల్లో భయాందోళనలు తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CBI Investigation : తిరుపతి చంద్రగిరి – రైల్వే SSE, ADEE లంచం కేసులో సీబీఐ విచారణ

    CBI Investigation :  ఏపీ తిరుపతి:  రెండు రైల్వే జోన్‌లకు చెందిన ఇద్దరు...

    Tirumala Updates : తిరుమల వెళ్తున్నారా? కొత్త రూల్స్ ఇవే..

    Tirumala New Rules : ప్రపంచ వ్యాప్తంగా Uఉన్న హిందూ దేవాలయాల్లో...

    Stick Enough To Threaten Tiger : పులి ని ఎదిరించడానికి, బెదిరించడానికి కర్ర చాలా.. ?

    Stick Enough To Threaten Tiger : తిరుమల కొండపై గతంలో...