36.8 C
India
Tuesday, May 21, 2024
More

    Break Even Skanda : బ్రేక్ ఈవెన్ కు ఈ మూడు రోజులే కీలకం.. స్కందకు కలిసి వస్తున్న సెలవులు

    Date:

    Break Even Skanda
    Break Even Skanda

    Break Even Skanda : ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ‘స్కంద’ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం (సెప్టెంబర్ 28న)  విడుదలైంది. సినిమా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లుగా తొలి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.14.8 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో డిస్ట్రిబ్యూటర్ల షేర్ విలువ సుమారు రూ.8.7 కోట్ల మేర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.7.4 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే, రెండో రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కొంత తగ్గాయి. రెండు రోజు రూ.4.7 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల్లో షేర్ వసూలైందని ట్రేడ్ వర్గాల సమాచారం.

    దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ ఎలిమెంట్స్ కు పెద్ద పీట వేస్తుంటాడు. అయితే, ‘స్కంద’ సినిమాలో  అతి అయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. రొటీన్ కథను విపరీతమైన వయొలెన్స్‌ జత చేశారని, సినిమా పెద్దగా ఏమీ లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి ఈ ప్రభావం కలెక్షన్ల మీద ఏ మేరకు పడుతుందో చూడాలి.

    సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా ఓపెనింగ్ డే వచ్చినన్ని కలెక్షన్లు రెండో రోజు రావు. శక్రవారం విడుదలైన సినిమాలకు అయితే శని, ఆదివారాలు పుంజుకుంటాయి. కానీ ఈ సినిమా గురువారం విడుదలైంది. శుక్రవారం కలెక్షన్లు తగ్గినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. కానీ వీకెండ్స్ అయిన శని, ఆదివారాలు మాత్రం తగ్గకూడదు. అలాగే సోమవారం గాంధీ జయంతి సెలవు. దీంతో వరుసగా మూడు రోజులను ‘స్కంద’ మూవీ ఏ మేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. అనుకున్న కలెక్షన్లు లేదంటే బ్రేక్ ఈవెన్ చేయడం కష్టమే మరి.

    ‘స్కంద’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.44 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తున్నది. రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన షేర్ దాదాపు రూ.14.5 కోట్లు. తెలుగు రాష్ట్రాల షేర్ రూ.12.11 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా రూ.30 కోట్లు షేర్ వసూలు చేస్తేనే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది.

    200 మార్కు: ఇక, ఈ చిత్రం ఓవర్సీస్‌లో 200K మార్కును చేరుకుంది. బోయపాటి కెరీర్‌లో వేగంగా ఈ మార్కును చేరుకున్న చిత్రాల జాబితాలో చేరింది.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Skanda Movie Review : ‘స్కంద’ రివ్యూ.. రామ్ కు బోయపాటి మాస్ హిట్ ఇచ్చాడా?

    Skanda Movie Review : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న...

    Skanda Political Satires : స్కంద మరో ట్రైలర్ రిలీజ్.. జగన్ పై పొలిటికల్ సెటైర్స్.. టార్గెట్ వారేనా?

    Skanda Political Satires : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా...

    ‘Skanda’ trailer : ‘స్కంద’ ట్రైలర్ ఈవెంట్ లో బాలయ్య.. రామ్ పై పంచుల మీద పంచులు..

    'Skanda' trailer : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న...

    “Skanda” Trailer : బోయపాటి – రామ్ ”స్కంద” ట్రైలర్.. ఊర మాస్ లెక్కలో ఉందిగా.. అంచనాలు పీక్స్!

    "Skanda" Trailer : టాలీవుడ్ లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం...