38.5 C
India
Tuesday, May 21, 2024
More

    Faria Abdullah : ఈ నర్సరీ క్రష్ ఏంటి చిట్టీ..

    Date:

    Faria Abdullah
    Faria Abdullah

    Faria Abdullah : జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన  తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా.. చిట్టి  క్యారెక్టర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమా ఎంత హిట్టయ్యిందో ఆ మూవీలో చేసిన వారందరికీ మంచి పేరొచ్చింది. ఆమె అసలు పేరుకన్నా  చిట్టి అంటేనే అందరికీ తెలుస్తుంది. అంతలా ఆ క్యారెక్టర్ తో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ఫరియా.

    అందం, అంతకు మించిన టాలెంట్ ఉన్న ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి.  సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నది.  2021లో జాతి రత్నాలు మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది ఫరియా అబ్దుల్లా. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చాలా పొడవుగా కనిపించే ఈ బ్యూటీ తన అందాలు, అమాయకత్వంతో అందరినీ మైమరిపించింది. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకంది. అదే ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  మూవీ కూడా చేసింది. ఆ తర్వాత యువ సామ్రాట్ నాగార్జున తో బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్,  రావణాసుర తదితర సినిమాలు చేసింది. కానీ మొదటి సినిమా ఆడినంతగా మరే సినిమా హిట్టవ్వలేదు. కానీ ఫరియా క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. వరసుగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు  సాగుతున్నది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్లను షేర్ చేసుకుంటూ ఉంటుంది. బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా అల్లరి నరేష్ తో జోడి కట్టింది. వీరిద్దరూ కలిసి ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లకు హాజరవుతున్నది.

    అతడే నా ఫస్ట్ క్రష్
    తాజాగా ఓ ఇంటర్వ్యూకు అటెండ్ అయిన ఫరియా తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకో వ్యక్తి అంటే చాలా ఇష్టమని చెప్పింది. బబ్లూ అనే ఓ వ్యక్తిని చూడగానే ప్రేమలో పడినట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది ఫరియా. అయితే ఇది తాను నర్సరీలో ఉన్నప్పటి నుంచి సంగతి అని  చెప్పింది. నర్సరీలో ఉండగానే.. అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు వెల్లడించింది. అంత చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించినట్లు చెప్పిన ఫరియా ప్రస్తుతం తన ఫస్ట్ క్రష్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో కూడా తెలియదని చెప్పుకొచ్చింది. ఇదంతా విన్న యాంకర్.. అరే బబ్లూ ఎక్కడున్నావో వచ్చి ఈ ముద్దుగుమ్మను పెళ్లి చేసుకోరా అంటూ చెప్పాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    Faria Abdullah : దుబాయ్ లో ఫరియా అబ్ధుల్లా.. ఏం చేస్తుందో తెలుసా?

    Faria Abdullah :113H, 10Y ప్రకారం ‘ఇచ్చేయండి సార్ పాపం బెయిల్...

    Faria Abdullah: డ్రెస్సు ఉన్నా లేనట్టే.. బ్రా అందాలతో మతులు పోగొడుతున్న ఫరియా అబ్దుల్లా..

    Faria Abdullah: సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడికి ఎంటర్ అయ్యే...