29.5 C
India
Sunday, May 19, 2024
More

    హంతకులను పట్టించిన చిలుక సాక్ష్యం

    Date:

    the parrot who caught the killers
    the parrot who caught the killers

    ఓ చిలుక హంతకులను పట్టించింది. చిన్న ప్రాణి అందునా మాట్లాడటం కూడా రాని చిలుక హంతకులను పట్టించడం ఏంటి? అని షాక్ అవుతున్నారా ? అసలు విషయం ఏంటంటే ……. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విజయ్ శర్మ – నీలమ్ శర్మ నివసిస్తుండేవారు.  2014 ఫిబ్రవరి 20 న నీలమ్ శర్మ ఆమె ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యింది. అంతేకాదు నీలమ్ శర్మ పెంపుడు కుక్కను కూడా అత్యంత దారుణంగా చంపేశారు. ఆ సమయంలో ఆమె భర్త విజయ్ శర్మ ఇంట్లో లేడు.

    అయితే హత్య అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేసారు కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆ కేసు మూలన పడేసారు పోలీసులు. అయితే విజయ్ శర్మ ఓ చిలుకను పెంచుకునేవాడు. ఆ చిలుక ను ప్రాణప్రదంగా పెంచుకున్నారు. ఇక ఆ చిలుక కూడా తన వాళ్లతో బాగా కలిసిపోయింది ……. విశ్వాసం అంటే ఏంటో నిరూపించింది.

    విజయ్ శర్మ కు అషు అనే మేనకోడలు ఉండేది. ఆమె తరచుగా విజయ్ శర్మ ఇంటికి వచ్చి మేనమామ – అత్తయ్య లతో సరదాగా ముచ్చటిస్తూ వెళ్తుండేది. అయితే భార్య చనిపోయిన తర్వాత అడపా దడపా అషు మేనమామ దగ్గరకు వచ్చి వెళ్తుండేది. అయితే మిగతా వాళ్ళు వచ్చిన సమయంలో ఎలాంటి అల్లరి చేయని చిలుక అషు వచ్చిన సమయంలో మాత్రం అదేపనిగా అరుస్తూ ఉండేదట. ఇలా చిలుక అరుస్తున్న సమయంలో పెద్దగా పట్టించుకోలేదట. అయితే అషు వచ్చిన సమయంలో మాత్రమే ఇలా చిలుక అరుస్తూ ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు విజయ్ శర్మ.

    ఇంకేముందు అంతకుముందు అనుమానితులతో పాటుగా అషు ను కూడా చిలుక ముందు నిలబెట్టగా అషు ను చూసి మళ్ళీ అదేపనిగా అరుస్తూ ఉందట. అంతేకాదు ఆమె మీదకు దాడి చేయడానికి కూడా వెళ్లిందట. దాంతో అషు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీలమ్ శర్మ నగల కోసమే ఆమెను తన స్నేహితుడు రోన్నితో కలిసి హత్య చేశామని , ఆ సమయంలోనే కుక్కను కూడా చంపామని వెల్లడించింది. దాంతో కేసును స్ట్రాంగ్ గా కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో 9 సంవత్సరాల తర్వాత ఇద్దరికీ జీవిత ఖైదు శిక్ష విధించింది కోర్టు. ఇక చిలుక అషును పట్టించిన కొంత కాలానికే చనిపోయింది. తన యజమాని హత్యను కళ్లారా చూసి పోలీసులకు సాక్ష్యం చెప్పిన చిలుక నిజంగా పెంపుడు జీవుల యొక్క ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పింది.  parrot , agra ,

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related