41.1 C
India
Monday, May 20, 2024
More

    ఏప్రిల్ 2nd 2023 రాశి ఫలితాలు

    Date:

    April 2nd 2023 Horoscope
    April 2nd 2023 Horoscope

    మేషం

    సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

    —————————————

    వృషభం

    ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

    —————————————

    మిధునం

    పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

    —————————————

    కర్కాటకం

    దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

    —————————————

    సింహం

    ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి.

    —————————————

    కన్య

    ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

    —————————————

    తుల

    కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

    —————————————

    వృశ్చికం

    స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

    —————————————

    ధనస్సు

    వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

    —————————————

    మకరం

    ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

    —————————————

    కుంభం

    ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత ఋణాలు తీరుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారము భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

    —————————————

    మీనం

    నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

    Share post:

    More like this
    Related

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు...

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...